Take a fresh look at your lifestyle.

కాపునేస్తంతో దక్కిన భరోసా

  • ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని వెల్లడి
  • సిఎం జగన్‌ను ప్రశంసించిన లబ్దిదారులు

అమరావతి,జూలై22:  వైఎస్‌ఆర్‌ ‌కాపు నేస్తం పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళకు 490. 86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేసింది.ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ లబ్దిదారు సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రయత్నాన్ని ప్రశంసించారు. ప్రభుత్వం తమకు అందిస్తున్న చేయూత గురించి ఆమె మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పాఠ్యాంశంగా పెడితే పెద్ద పుస్తకం అవుతుంది అంటున్నారు మా పిల్లలు. రు తీసుకొచ్చిన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం అందరికి పారదర్శకంగా.. అవినీతికి తావు లేకుండా ప్రతి రూపాయి లబ్దిదారులకు చేరుంది. గతంలో ఎందరో ఎన్నో వాగ్దానాలు చేశారు.. కానీ నిలబెట్టుకోలేదు. కానీ సీఎం జగన్‌ ఒక్కసారి మాట ఇస్తే.. తప్పకుండా నిలబెట్టుకుంటారని అన్నారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్ని భయపడుతున్నాయి.

కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ప్రజల కష్టాలను తీసుకుని.. ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. కాపు నేస్తం అంటేనే స్నేహితుడని. కాపుల రిజర్వేషన్ల కోసం ఎందరో ఎన్నో చేశారు. కానీ ఎవరు ఏం చేయలేదు. కానీ రు కాపులకు, ముఖ్యంగా కాపు మహిళలకు రు చేయూతనిస్తున్నారు. ఇంటికి దీపం ఇల్లాలు. కానీ రు అందరి ఇళ్లలో వెలుగు నింపుతున్నారు. రైతు భరోసా పథకాన్ని రెండేళ్ల నుంచి పొందుతున్నాను. ఉచిత బోరు చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుంది. సీమలో నీటి ఎద్దడి గురించి అందరికి తెలుసు. కానీ రు వచ్చాక వర్షాలే వర్షాలు. రెండేళ్ల వరకు నీటికి సమస్యలేదని తెలిపారు. పశ్చిమగోదావరి ఏలూరు కలెక్టరేట్‌ ‌నుంచి కాపు నేస్తం మహిళా లబ్దిదారు మాట్లాడుతూ.. జగనన్న వచ్చిన తర్వాత తమ కోసం నిధులు కేటాయించడం సంతోషం. గతంలో మాకు కోసం ఎవరూ చేయని ఆలోచన చేశారు.

ఎవరూ రూపాయి ఇవ్వలేని టైమ్‌లో రు అమలు చేసిన పథకాలతో ఊపిరి తీసుకున్నాం. ఏలాంటి కష్టలేకుండా బ్రతుకున్నాం. డ్వాక్రా గ్రూప్‌లో చేరాం.. ఒక అన్నయ్య ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. కోవిడ్‌ ‌టైమ్‌ ‌కూడా రు పథకాలు అమలు చేసి చూపించారని ప్రశంసించారు. తూర్పు గోదావరి కలెక్టర్‌ ‌మహిళా లబ్దదారు మాట్లాడుతూ.. ఇంతవరకూ కాపుల కోసం ఎవరూ ఆలోచించలేదు. నా కాళ్ల ద నేను బ్రతకగలను అనే భరోసా వచ్చింది. ఎలా బ్రతకాలనేది తెలియదు.. రు మా కోసం పథకాలు అమలు చేసిన తర్వాత బ్రతగలననే ధైర్యం వచ్చింది. కాపు నేస్తం ప్రవేశపెట్టడం కరోనా కష్టకాలంలో చాలా ఉపయోగ పడింది. అమ్మ ఒడి పథకం కూడా వచ్చిందన్నా.. నాకు ఒక అన్నయ్య ఉన్నాడనే అనుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా కాపు మహిళల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

Leave a Reply