Take a fresh look at your lifestyle.

లబ్దిపొందనివారి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : పిఓ

నిరుపేదలైన ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ఐటిడిఏ ద్వారా మంజూరు చేసే సబ్సిడీకి సంబంధించిన వివిధ పథకాలు సంబంధిత యూనిట్‌ ఆఫీసర్లు అర్హులైన వారిని గుర్తించి గతంలో లబ్దిపొందినవారు కాక మిగతా వారికి చెందేల ప్రతిపాదనలు సిద్దం చేయాలని భద్రాచలం ఐటిడిఏ పిఓ గౌతమ్‌ ‌పొట్రూ యూనిట్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్‌లో ఐటిడిఏ లోని యూనిట్‌ అధికారుల వారీగా సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గిరిజన సొసైటీల ద్వారా నడుపబడుచున్న మిల్లు పనులు త్వరితగతిన పనులు ప్రారంభించి వారే స్వంతగా నడుపుకునేల అవగాహన కల్పించాలని న్యూట్రీషన్‌ ‌బిస్కెట్‌కు సంబంధించిన పనులు పూర్తి చేసి 22 జూన్‌ ‌నాడు పనులు ప్రారంభించాలని దాని ద్వారా ఉత్పత్తి అయ్యే పౌష్టికాహారం ఆశ్రమ పాఠశాలలో మెను పొందుపరిచి జిసిసి ద్వారా సరఫరా అయ్యే సోప్‌ ‌యూనిట్స్ ‌పనులు ప్రారంభించాలని , జిసిసి డియంకు ఆదేశిస్తూ శౄనీటైజర్‌ ‌మరియు మాస్కులు మన్నికైనవి తయారు చేయాలని ఆదేశించారు. మారుమూల మండలాలైన కారేపల్లి, వ్యవసాయానికి హర్వేస్టర్‌ ‌సంబంధించిన పనముట్లు గోడౌన్‌ ‌పనులు క్వాలీటి గా ఉన్నది పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలని ఏడిఏకు ఆదేశించారు.

గిరి వికాసం క్రింద 763 యుసిలు గ్రేడ్‌ అయ్యాయని జూలూరుపాడు, టేకులపల్లి తదితర మండలాల్లో ట్రైకార్‌ ‌లబ్దిదారులకు అందేల ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. ట్రైకార్‌ ‌ద్వారా రైతులకు చేయూత ఇవ్వడానికి వెసులుబాటు కల్పించవచ్చని ఐఎఫ్‌డి పథకం ద్వారా చేపటల పెంపకానికి గిరిజన సొసైటీలకు శిక్షణ ఇవ్వడానికి లబ్దిదారులను గుర్తించాలన ఎస్‌ఓ ‌సురేష్‌కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసిఓ జనరల్‌ ‌నాగోరావు, డిడిటిడబ్ల్యూ జహీరుద్దీన్‌, ఏఓ ‌భీమ్‌, ఇఇటిడబ్ల్యూ రాములు, ఏడిఏ సుజాత, డియంజిసిసి వాణి, ఆర్‌సిఓ గురుకులం బురాన్‌, ‌జెడియం హరికృష్ణ, ఏపిఓ పవర్‌ అనురాధ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply