Take a fresh look at your lifestyle.

పౌర హక్కుల ఉద్యమం ప్రారంభం ..3

“పార్వతీపురం కుట్రకేసు చాలా పెద్దకేసు గనుక, అప్పటికే నక్సలైటు ఉద్యమంలో చీలికలు మొదలయి, అన్ని వర్గాల వాళ్ళు వేరు వేరు న్యాయవాదులను కోరుకున్నారు గనుక, ఆ కేసులో చాలామంది నిందితులు నిరక్షరాస్య గిరిజనులు గనుక ఆ కేసు వాదనల పనిని చాలామంది న్యాయవాదులతో పంచుకోవలసి వచ్చింది. ఆ కేసు విచారణల సందర్భంగా, వాదనలు తయారు చేసుకునే సందర్భంగా నిందితుల తరఫున వాళ్ళ బంధువులో, మిత్రులో, రాజకీయ ప్రతినిధులో న్యాయవాదు లను తరచుగా కలుస్తుండే వాళ్ళు. డిఫెన్సు కమిటీల ఏర్పాటులోను, దాని పనిలోను, తరిమెల నాగిరెడ్డి చాల శ్రద్ధాసక్తులు కనబరిచారు. ఆయన చాల తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవారు. లెక్కలేనన్ని చార్మినార్‌ ‌సిగరెట్లు, చాయ్‌లు తాగుతూ కేసుల విషయాలు మాట్లాడుతుండే వారు. డిఫెన్స్ ‌కమిటీ ఏర్పడిన కొత్తలో అందులో న్యాయవాదులందరమూ ఏ విభేదాలు లేకుండా చేరాం గాని క్రమక్రమంగా పత్తిపాటి వెంకటేశ్వర్లు చారుమంజుదార్‌ అభిమాని అయ్యారని నాగిరెడ్డికి అనుమానం ఉండేది.”

ఈ కేసులో 1970 జనవరిలో ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలయింది. బొడ్డుపాడు గ్రామంలో 1968 అక్టోబర్‌లో సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో జరిగిన కుట్రవల్ల ఆ తర్వాత ఏడాదిన్నరలో 30 హత్యలు, 100 దోపిడీలు, 200 ఇతర నేరాలు జరిగాయని 1970 అక్టోబర్‌లో పెట్టిన ఛార్జిషీట్‌లో అభియోగాలు మోపారు. ఆ కేసు నత్తనడక నడుస్తోంది గనుక, ఇంతమంది నిందితుతో, సాక్షులతో కేసు విచారణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు గనుక నిందితులందరినీ విడుదల చేయాలని మేం మా రిట్‌ ‌పిటిషన్లలో అభ్యర్థించాం. ఆ రిట్‌ ‌పిటిషన్ల మీద జీవన్‌ ‌రెడ్డి, నేను వాదించాం.
మా వాదనల ఫలితంగా ప్రభుత్వం పార్వతీపురం కుట్రకేసు విచారణ జరపడానికి విశాఖపట్నంలో ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. అట్లాగే నాగిరెడ్డి కుట్రకేసు విచారణ కోసం హైదరాబాదులో మరో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటయింది. పార్వతీపురం కుట్రకేసు చాలా పెద్దకేసు గనుక, అప్పటికే నక్సలైటు ఉద్యమంలో చీలికలు మొదలయి, అన్ని వర్గాల వాళ్ళు వేరు వేరు న్యాయవాదులను కోరుకున్నారు గనుక, ఆ కేసులో చాలామంది నిందితులు నిరక్షరాస్య గిరిజనులు గనుక ఆ కేసు వాదనల పనిని చాలామంది న్యాయవాదులతో పంచుకోవలసి వచ్చింది.

ఆ కేసు విచారణల సందర్భంగా, వాదనలు తయారు చేసుకునే సందర్భంగా నిందితుల తరఫున వాళ్ళ బంధువులో, మిత్రులో, రాజకీయ ప్రతినిధులో న్యాయవాదు లను తరచుగా కలుస్తుండే వాళ్ళు. డిఫెన్సు కమిటీల ఏర్పాటులోను, దాని పనిలోను, తరిమెల నాగిరెడ్డి చాల శ్రద్ధాసక్తులు కనబరిచారు. ఆయన చాల తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవారు. లెక్కలేనన్ని చార్మినార్‌ ‌సిగరెట్లు, చాయ్‌లు తాగుతూ కేసుల విషయాలు మాట్లాడుతుండే వారు. డిఫెన్స్ ‌కమిటీ ఏర్పడిన కొత్తలో అందులో న్యాయవాదులందరమూ ఏ విభేదాలు లేకుండా చేరాం గాని క్రమక్రమంగా పత్తిపాటి వెంకటేశ్వర్లు చారుమంజుదార్‌ అభిమాని అయ్యారని నాగిరెడ్డికి అనుమానం ఉండేది.నాకు ఈ విభేదాల మీద అప్పుడూ ఇప్పుడూ కూడా సదభిప్రాయం లేదు. అందువల్ల నా దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తుండేవాళ్ళు. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, ‌చెరబండరాజు, పత్తిపాటి వెంకటేశ్వర్లు, రంగనాధం లాంటి వాళ్ళందరూ ఎప్పుడూ కలుస్తుండేవాళ్ళు.

అటు కేసుల విషయంలోను, ఇటు బెయిల్‌ ‌పిటిషన్లు వాదించడం, షరతులతో కూడిన బెయిల్స్ ‌వస్తే, ఆ షరతులను ఎత్తివేయించడం కోసం ప్రయత్నించడం మొదలయిన పనులను డిఫెన్స్ ‌కమిటీ బాగానే చేసింది. మా పనిలో జిల్లాలో న్యాయవాదులెందరో కూడా భాగం పంచుకున్నారు. ఒక కొత్త, యువ న్యాయవాదుల బృందం ముందుకొచ్చి ప్రజా ఉద్యమ కార్యకర్తల కోసం నిస్వార్ధంగా కృషిచేసే సంప్రదాయం మొదలయింది.ఇటు న్యాయవాదులు డిఫెన్సు కమిటీని కొనసాగిస్తుండగానే, 1974లో హైదరాబాదులో ఒపిడిఆర్‌ (ఆర్గనైజేషన్‌ ‌ఫర్‌ ‌ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ‌డెమొక్రటిక్‌ ‌రైట్స్), ‌గుంటూరులో ఆంధ్ర ప్రదేశ్‌ ‌పౌరహక్కుల సంఘం (ఆంధ్ర ప్రదేశ్‌ ‌సివిల్‌ ‌లిబర్టీస్‌ ‌కమిటీ – ఎపిసిఎల్‌సి) ఏర్పడ్డాయి.వివేకవర్ధిని కళాశాల (హైదరాబాదు) లో వాదారి వెంకటరామయ్య అనే సీనియర్‌ ‌న్యాయవాది నాయకత్వంలో ఒపిడిఆర్‌ ‌ప్రారంభ సభ జరిగింది. అప్పటికే డిఫెన్స్ ‌కమిటీ వల్ల ఏర్పడిన సాన్నిహిత్యంతో నన్ను ఒపిడిఆర్‌లో చేరమని నాగిరెడ్డి ఆహ్వానించారు. అప్పటికే నాగిరెడ్డి రాజకీయాలకు భిన్నంగా చారుమజుందార్‌ ‌రాజకీయాలతో ఉన్న భూమయ్య, కిష్టా గౌడ్‌ ఉరిశిక్ష రద్దు ఉద్యమంలో కూడ ఉన్నాను. కాని ఎపిసిఎల్‌సిలో చేరాలని కూడ నేను అనుకోలేదు.

ఏ ఒక్క బృందంతోనూ నన్ను నేను కలిపి చూపుకోవాలని అనుకోలేదు.మరికొద్ది నెలలకే దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. ఒపిడిఆర్‌, ఎపిసిఎల్‌సి రెండూ పనిచెయ్యలేని స్థితి వచ్చింది. ఇటు డిఫెన్స్ ‌కమిటీకి, అటు ఎపిసిఎల్‌సి కి కూడ కార్యదర్శిగా ఉండిన పత్తిపాటి వెంకటేశ్వర్లును ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో తోసింది. డిఫెన్స్ ‌కమిటీని మూసివేయడం మంచిదని ఒక న్యాయవాది సలహా ఇచ్చారు. నాతో మాట్లాడడానికి తోటి న్యాయవాదులు భయంభయంగా ఉండే పరిస్థితి వచ్చింది.జూన్‌ 26, 1975 – అది రాజకీయ చరిత్రలో చాలా పెద్ద దుర్దినం. ఆ రోజుల ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కేవలం తన పదవిని కాపాడుకోవడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. రాజ్యాంగంలోని 352 అధికరణం ప్రకారం, అసలు మొత్తంగా 18వ భాగం ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని కేంద్ర మంత్రి వర్గసలహా మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ‌జూన్‌ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించారు.ఎమర్జెన్సీ ప్రకటించడమంటే రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చెయ్యడమన్న మాట. ఎమర్జెన్సీ ప్రకటించడమంటే రాజ్యాంగ బద్ధపాలనను తుంగలో తొక్కడమన్న మాట.

నిజానికి రాజ్యాంగం అప్పటికి అమలులోకి వచ్చి పావు శతాబ్దం గడిచినా, రాజ్యాంగంలోనే ఎమర్జెన్సీ విధించే అధికరణాలు ఉన్నప్పటికీ అటువంటి చీకటి రాజ్యం వస్తే ఎలా ప్రవర్తించాలో భారత ప్రజానీకం సంసిద్ధంగా లేదు.ఎమర్జెన్సీ ప్రకటించబడే నాటికి మేమంతా భూమయ్య, కిష్టాగౌడ్‌ ఉరిశిక్షను రద్దు చేయాలనే ఆందోళనలో తలమునకలుగా ఉన్నాం. మే లో అనుకుంటాను ఆ ఉరిశిక్ష రద్దు ఆందోళనలో భాగంగా పెద్ద సభ జరిపాం. అప్పటికి ఆ సభ జరిపిన వాళ్ళం కూడ ఎమర్జెన్సీ వస్తుందని ఊహించలేదు.నిజానికి దేశంలో అప్పటికే ఎక్స్‌టర్నల్‌ ఎమర్జెన్సీ (బాహ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితి) అమలులో ఉంది. 1962లో చైనా యుద్ధం సందర్భంగా ఎమర్జెన్సీ ప్రకటించ బడింది. ఆ ఎమర్జెన్సీని తొలగించాలని కొంత ఆందోళన ఉండేది గాని దాన్ని ఎత్తి వేయడం జరగలేదు. అసలు 1947 నుంచే దేశంలో నిరంకుశ ప్రభుత్వ పాలనకు చట్టబద్ధంగానూ, చట్టానికి బైటా బీజాలు పడ్డాయి. ఆ చర్చ మరొకసారి గాని ఇప్పటికి 1975 ఎమర్జెన్సీ సంగతి చూద్దాం.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపా

Leave a Reply