విద్యార్థినిలు బాగా చదువుకొని అభివృద్దిలోకి రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన వనపర్తి పట్టణంలోని మైనారిటి రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాలును,స్నానపు గదులు టాయిలెట్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. భోజనం బాగుందా? ఏమి పెడతున్నారు? అని అడిగారు. తన స్వంత ఖర్చుతో గురువారం చికెన్, శుక్రవారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డైనింగ్ హాల్లో సిమెంటు ప్లోరింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినిలు బాగా చదివి వృద్దిలోకి రావాలని చెప్పారు. మరోసారి పాఠశాలకు వచ్చి వివిధ అంశాలపై ప్రశ్నల పోటీ నిర్వహించిబహుమతులిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్ గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, వార్డు కౌన్సిలర్, జిల్లా మైనార్టి అధికారి అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.