Take a fresh look at your lifestyle.

‘‌సహకార’ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Beginning of acceptance of supporting digital nominations

ఈనెల 15న జరిగే సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారం ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. ఉదయం నుండే ఆయా గ్రామాల్లో దీనికి సంబంధించిన కోలాహలం కనిపించింది. నిర్దేశించిన ప్రోఫార్మాలో అభ్యర్దులు తమ పేరు, తదితర వివరాలను పూర్తిచేసి సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి ఎన్నికల అధికారులకు అందజేసారు. మధిర మండలం పోచారం సోసైటీకి సంబంధించి మొదటి నామినేషన్‌ ‌సెట్టును టిఆర్‌ఎస్‌ అభ్యర్ది నర్వనేని పెద్ద అంజయ్య ఎన్నికల అధికారికి అందజేసారు. ఇంకా అనేక ప్రాంతాల్లో అభ్యర్దులు తమ అనుయాయులతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆయా సొసైటీ కార్యాలయాల్లో నామినేషన్ల సందర్బంగా సందడి నెలకొంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పటంతో అభ్యర్దులు దానికి సంబంధించిన డిపాజిట్‌ను కట్టి త్వరత్వరగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఇదిలా ఉండగా పలు సహకార సంఘాలను ఏకగ్రీవంగా చేసి చైర్మన్‌గిరిలను ఏకపక్షంగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కొన్నిగ్రామాల్లో ఆశావహులను బుజ్జగిస్తున్నారనే వార్తలు వినవస్తున్నాయి. మహిళలకు రిజర్వ్ అయిన స్తానాల్లో మహిళలు స్వతంత్రంగా వెళ్లి తమ నామినేషన్‌ ‌పత్రాలను అధికారులకు అందజేస్తున్నారు.

కారేపల్లిలో…
కారేపల్లి, ఫిబ్రవరి 6 (ప్రజాతంత్ర విలేకరి) : సింగరేణి మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు ఈ నెల 15న జరగనున్న విషయం విధితమే. అందుకోసం మండల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున 12వ డివిజన్‌ అభ్యర్థిగా మాదారం మాజీ సర్పంచ్‌ ‌దారావత్‌ ‌మంగీలాల్‌ ‌గురువారం మండల టీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా వచ్చి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్‌పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తోటకూరి పిచ్చయ్య మాట్లాడుతూ మండలంలోని మిగతా 12 డివిజన్లకు శుక్రవారం నామినేషన్‌ ‌వేస్తామన్నారు. మొత్తం 13 వార్డులు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్‌ ‌శకుంతల కిషోర్‌, ‌జడ్పీటీసీ వాంకుడోత్‌ ‌జగన్‌ , ‌వైస్‌ ఎం‌పీపీ రావూరి శ్రీనివాసరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, ముత్యాల సత్యనారాయణ, అడపా పుల్లారావు, నర్సింగ్‌ ‌శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy