Take a fresh look at your lifestyle.

‌శ్రామిక సౌందర్యం

పుడమి నుదుట బాసిసిల్లినా ముత్తేదువ కుంకుమ బొట్టు
మట్టి పరిమళల సేద్యంలో ఆకు పచ్చని పట్టు చీరతో
‘‘ పచ్చని మాగాణి ‘‘ ప్రకృతి ఒడిలో ఒదిగి పోతుంది.!
అంకురాల అమ్మతనం చంటి పాపల పెదవి రుచుల పాలధారాలు
జలధారలై ప్రవహిస్తూ.. నేల తల్లి అనురాగాల అంబుల పొదుగు..
అన్నదాత మోములో వెలుగులు నింపుతుంది.!
భూతల్లిని నమ్ముకున్న శ్రమజీవుని.. రక్త హలంలో
జారు పడుతున్న స్వేద బింబపు చెమట చుక్కల వాసనా..
అది ధరణి ధరించిన భూగంధపు మణిహారమై..
దాతృత్వం నిండిన హృదయం మట్టిలో కలిసి మురిసిన శ్రామిక సౌందర్యం..
సుగంధాల మల్లెల వసంతమై కోకిల రాగాలు ఆలపిస్తుంది..
కాలం ఆడిన విధి నాటకం లో పావులైన నల్ల రేగడి బీడు నేలలు
నెర్రబారి కొండ చిలువల నోళ్లయి బోరున విలపిస్తున్నాయి..
బక్క చిక్కిన అస్తిపంజరం లా.. పశువుల ఆకలి కేకలు అరణ్య రోదనలయితే
దున్నే రైతు నోట్లో మట్టి కొట్టే మార్కెట్‌ ‌మాయాజాలంలో
రైతుల గోసలు ఎండమావులయ్యాయి..!
నిత్యం పొలం గట్లపై అల్లరి చేసే తుమ్మెదల సవ్వడి వినిపించక..
ఆకాశంలో నల్ల మబ్బులు మొఖం చాటేసాయ్‌..!
ఆకలి తీర్చే ఆత్మీయుడే ఉరిత్రాళ్లను ముద్దడుతుంటే..
మానవ మనుగడ ప్రశ్నర్థకమే అవుతుంది.!
ఇకనైనా మేలుకొలుపు పాడుదాం
చేస్తున్న తప్పులు సరిదిద్దుకొని
జై కిసాన్‌ ‌కు జేజేలు పలుకుదాం..
అప్పుడే..

రైతుల పెదవులపై చిరునవ్వు తొణికిస లాడుతుంది
వారి  ఎదలోతుల్లో ఆనందం పండు వెన్నెలయి..
పాడిపంటల ముసి ముసి నవ్వులతో
దేశం సుభిక్షం అవుతుంది..!!

– రవీందర్‌ ‌కొండా
9059237771

Leave a Reply