Take a fresh look at your lifestyle.

శీర్షిక: అందమైన లోకమని..!

కాలం ఆగదు
కలలు ఆగవు
మనసు నిలవదు
వలపు మలుపు తిప్పకతప్పదు

కనులకు కనిపించేదంతా
నిజంకాదు కాదుకూడ
రెప్పపాటు కాలంచాలు
వలపు మాయలా కప్పేసేందుకు

మాటుగా కదులుతుంటారు
మాటలు కలుపుతుంటారు
వెలుగు రెక్కలు విరిచేసే
నయవంచక మనుషులుండే
మాయదారి లోకమిది

మానవత్వం మరచి
నీచత్వం లోలోపల కప్పేసుకుని
మేకవన్నె పులులున్న భయంకరమైన అడవిది

అందుకే అడుగులు జాగ్రత్త!
ఆదమరిచావో
సమస్యల సుడిగుండంలో పడి
తేరుకోలేని తీరం చేరుకుంటావు

ఎవరి మనసులో ఏముందో తెలియని
మనుషులు నడయాడే లోకమిది
మంచితనంతోనే ముంచడం నేటి నైజం

అమ్మపాల అమృతం తాగిన
అసురులై విషంచిమ్మే వింతజీవుల ప్రయోగశాల
క్షణిక సుఖాలకు
సంతోషాలకలవాటుపడిన
నైతికత మరచిన తరం ఇది
తస్మాత్‌ ‌జాగ్రత్త!!!

– సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు, 9010480557.

Leave a Reply