Take a fresh look at your lifestyle.

అం‌దమైన నా మీ కనుగోళాలు….!!

అందమైన గోళాలు
అపురూపమైన వెలుగు
సున్నితమైన చూపు
సుందర సువిశాలమైన
ప్రపంచాన్ని చూపే కిరణాలు

కలలు కనే మనోదీపాలు
కన్నీరు పెట్టించేద గోళాలు
ఆనందాన్ని చూపు అత్రినేత్రాలు
అందరిని చూస్తూ..అందాలను చూస్తాయి
కనువిందు చేస్తూనే…సాక్ష్యానికి ఆనవాళ్లు గా నిలిచే అపురూపాలు
మనిషి మరణించినా మరొకరికి చూపునిచ్చే అంధకార బంధారాన్ని తొలిగించే తొలికిరణలు…
కనుచూపుకు మరణంలేదు
తలుపులు తెరిస్తే వెలుగులు
రెప్పలు మూస్తే చీకట్లు
ప్రకృతిని చూస్తాయి
ప్రపంచాన్నే చూస్తాయి
నా..మీ కంటి వెలుగులు.

– మొహమ్మద్‌ ‌రహీంపాష
వరంగల్‌ అర్బన్‌, ‌సెల్‌ :-8008748426

Leave a Reply