Take a fresh look at your lifestyle.

పల్లె ప్రకృతి వనాలతో తెలంగాణ సింగారం

సింగరాయపాలెం గ్రామ అందాలను ట్వీట్‌ ‌చేసిన కెటిఆర్‌
‌రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనం కార్యక్రమంతో తెలంగాణలోని గ్రామాలు కొత్తందాన్ని సంతరించుకున్నాయి. ప్లలెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామగ్రామన పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని గ్రామాల్లో ప్లలె ప్రకృతి వనాలు కళకళలాడుతున్నాయి. పచ్చని చెట్లు, మొక్కలతో పాటు కూరగాయలు, ఆకు కూరలు, వివిధ రకాల పండ్ల చెట్లతో గ్రామానికి ప్రశాంత వాతావరణాన్ని తీసుకువొచ్చాయి. రంగు రంగుల పూలు, నీడనిచ్చే చెట్లు, అందంగా కనిపించే పచ్చని మొక్కలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ విధంగా ఆకట్టుకునే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెంలోని పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌లో షేర్‌ ‌చేశారు. ‘సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో రూపుదిద్దుకుని గొప్ప ఫలితాలను చూపిస్తున్న ప్లలె ప్రకృతి వనం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల్లో 10 శాతం బ్జడెట్‌ను ప్రత్యేకంగా గ్రీన్‌ ‌కవరేజీకి కేటాయించినట్లు చెప్పారు.

Leave a Reply