Take a fresh look at your lifestyle.

అమ్మలకు అండగా ఉండాలి: మంత్రి హరీష్ రావు

 

*అమ్మను ఆదుకోవాలని మంత్రికి వాట్సాప్ సందేశం

*స్పందించిన మంత్రి హరీశ్ రావు

*మెరుగైన వైద్యం కోసం ఏల్ఓసీ జారీ

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నంట యాదిరెడ్డి తల్లి పద్మ గత కొంత కాలంగా వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్నారు. అసలే పేదరికం పైగా., లాక్ డౌన్ సందర్భంలో తల్లిబాధను వివరిస్తూ., మా అమ్మను ఆదుకోవాలని మంత్రి హరీశ్ రావుకు వాట్సాప్ సందేశాన్ని పంపారు. అమ్మకు ఏం కాదు., అధైర్యపడొద్దని.. అండగా నేనుంటానని మంత్రి స్పందిస్తూ.. యాదిరెడ్డికి భరోసాను ఇచ్చి నంట పద్మకు కావాల్సిన మెరుగైన వైద్య చికిత్సకు హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం నంట పద్మకు మెరుగైన వైద్య చికిత్సకు అవసరమైన రూ. 2 లక్షల రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని నంట యాదిరెడ్డికి మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందజేశారు. మా అమ్మను ఆపదలో ఆదుకున్న హరీశ్ రావుకు వేవేల దండాలు తెలిపారు.

Leave a Reply