Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో.. దంచికొడుతున్న వానలు

  • మరో అల్ప పీడన ప్రభావంతో పలు జిల్లాలకు భారీ వర్షసూచన
  • అప్రమత్తం చేసిన అధికారులు.. కృష్ణాకు కొనసాగుతున్న వరద
  • వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : అధికారులతో సక్షలో మంత్రి కెటిఆర్

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా 3.1 కి.. నుంచి 7.6 కి.. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలోనూ గంటకు 30 నుంచి 40 కిలోటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌, ‌ఖమ్మం జిల్లాలలో భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల వలన వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉంది.

వర్షాల వలన వరదలు సంభవించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. చెట్లు, ఎలక్ట్రిక్‌  ‌పోల్స్, ‌పడిపోవడం వలన సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుంది, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వలన లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు, కాజివేలలో నీరు ప్రవహించే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ అం‌తరాయలు, ప్రజలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. జిల్లా యంత్రంగం మొత్తం అప్రమత్తంగా ఉండి. ఇంతకు ముందే జారీ చేసిన ఫ్లడ్‌ ‌ప్రోటోకాల్‌ ‌తప్పని సరిగా ఫాలో కావాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కూడా ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌తో సక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను, ఎస్‌పిలను అప్రమత్తంగా ఉండాలని పరిస్థితులను ఎప్పడికప్పుడు గమనించాలని సీఎం కోరారు. అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కృష్ణాకు కొనసాగుతున్న వరద
కుండపోత వర్షాలకు కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నదిపై అన్ని ప్రాజెక్టులు నిండటంతో వస్తున్న ఇన్‌ ‌ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయానికి జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 1,63,000 క్యూసెక్కుల వరద వస్తోంది. 20 గేట్లను ఎత్తి 1,67,835 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు 9.657 (టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1043 అడుగులు (8.830 టీఎంసీలు)గా ఉంది. శ్రీశైలం జలాశయానికి 1,74,869 క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో ఉంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు (215.8 టీఎంసీ)లు కాగా ప్రస్తుతం 884.2 అడుగులు (210.9) టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,16,033 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 13,076 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నిన్నటితో పోలిస్తే నాగార్జున సాగర్‌కు కాస్త ఇన్‌ ‌ఫ్లో తగ్గింది. ఎగువ నుంచి 1,61,499 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అధికారులు 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,61,499 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.10 అడుగులు (309.35 టీఎంసీలు)గా ఉంది.

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : అధికారులతో సక్షలో మంత్రి కెటిఆర్‌
‌నగరంతో పాటు మిగతా మున్సిపాలిటీల్లో కురుస్తున్న వర్షాలు, వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఎలాంటి విపత్తును అయినా ఎదుర్కొనేలా అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. ఈ మేరకు కెటిఆర్‌ ‌సక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, జీహెచ్‌ఎం‌సీ, జలమండలి అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్‌ ‌సహా అన్ని పురపాలికల్లో ప్రస్తుత పరిస్థితులపై కేటీఆర్‌ ఆరా తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రానున్న 2 వారాల పాటు అధికారులకు సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. నిరంతరం క్షేత్రంలో ఉంటూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. గత 10 రోజుల్లోనే 54 సెం.. భారీ వర్షపాతం నమోదైందని తెలిపారు. భారీ వర్షంలోనూ సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి చెప్పారు. వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు మరింత పెంచాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. నిరంతరం క్షేత్రంలో ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.  కేవలం పది రోజుల్లోనే గ్రేటర్లో యాభై నాలుగు సెంటీటర్ల భారీ వర్షపాతం నమోదైందని మంత్రి తెలిపారు. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మత్తులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింతగా పెంచాలని ఆదేశించారు. సిటీలో శిథిలావస్థకు చేరిన భవనాలను తక్షణమే కూల్చి వేయాలన్నారు. జీహెచ్‌ఎం‌సీలో భారీ వర్షాలతో పాడైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

 

Leave a Reply