కరోనా వైరస్ పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లన్నారు. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 31 వరకు అందరూ ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దొన్నారు.
అదేవిధంగా ఈ నెల 22న జనతా కర్ఫ్యూను ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పాటించాలన్నారు. ఎవరికైనా అనుమానాలు వ్యక్తమయితే 104కి కాల్ చేసి సలహాలు తీసుకోవాలన్నారు. ప్రాణాలకు తెగించి కొరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు వందనాలు తెలిపారు. వివాహాలకు, శుభాకార్యలకు దూరంగా ఉండాలన్నారు. విదేశాల నుండి వచ్చిన వారి వివరాలను తప్పనిసరిగా జిల్లా అధికారులకు సమాచారమివ్వాలన్నారు.