Take a fresh look at your lifestyle.

స్టేషన్‌కు వచ్చేవారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి

జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌  ఆదేశాల మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ ‌నందు పోలీస్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌సిఐ రాజగోపాల్‌  ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్‌ ‌స్టేషన్లలో పనిచేసే రిసెప్షన్‌ ‌సిబ్బంది మరియు దర్యాప్తు సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా సిఐ రాజగోపాల్‌ ‌మాట్లాడుతూ పోలీస్‌ ‌స్టేషనుకు వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తిం చాలని,వారిలో మనోధైర్యాన్ని నింపే విధంగా ప్రవర్తించాలని, వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషిచేయాలని తెలిపారు.

వచ్చిన బాధితులు చదువుకున్నవారయితే వారి చేతనే దరఖాస్తును వ్రాసి ఇచ్చే విధంగా వారికి తగు సూచనలు  ఇస్తూ సహాయపడాలని తెలియజేశారు. పిటిషన్‌ ఎం‌క్వైరీ కొరకు వెళ్లే అధికారులు ఎలాంటి ఆలస్యం చేయకుండా అట్టి ప్రదేశానికి చేరుకొని బాధితులకు మనోధైర్యాన్ని నింపే విధంగా ప్రవర్తించాలని తెలిపారు.5ఎస్‌  ‌విధానాన్ని అమలు చేయడంలో భాగంగా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించి అన్ని రకాల ఫైళ్లను ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవాలని, రకరకాల కేసులతో సంబంధం ఉన్న వాహనాలకు సంబంధించిన వివరాల కొరకు ఒక రిజిస్టరును ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!