Take a fresh look at your lifestyle.

కొరోనాతో జాగ్రత్తగా ఉండండి

ఫేస్‌ ‌మాస్క్‌లు ధరించాలి: ప్రధాని మోదీ

కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోకండని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని, ఫేస్‌ ‌మాస్క్‌లు ధరించాలన్న నిబంధనను పాటించాలని, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే వరకు సామాజిక దూరాన్ని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కోరారు. కుటుంబంలోని
సీనియర్‌ ‌సిటిజన్లను జాగ్రత్తగా చూసుకోవాలని, ఈ సామాజిక వ్యాక్సిన్‌ ‌కరోనా వైరస్‌ ‌నుంచి మనలను రక్షించుకోవడానికి ఉత్తమ మార్గమని మోదీ అన్నారు.

దేశ ప్రజలు కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు అనిమోదీ విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రారంభంగా వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మోదీ మాట్లాడారు. తాను ప్రజల నుంచి కోరుకుంటున్నది ఏంటంటే.. వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండి, తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. శాస్త్రవేత్తలందరూ వ్యాక్సిన్‌ ‌కోసం కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్‌ ‌వచ్చే వరకు తమకు తాము రక్షించుకునేందుకు సామాజిక దూరం పాటించడమే ఉత్తమమని మోదీ అన్నారు.

Leave a Reply