Take a fresh look at your lifestyle.

జంక్‌ ‌ఫుడ్‌ ‌తో జర జాగ్రత్త..

బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి ‘ఫాస్ట్ ‌ఫుడ్స్’‌ను ఆశ్రయిస్తుంటాం, జంక్‌ ‌ఫుడ్‌ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయని, వాటి వల్ల మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి అంతరించడంతోపాటు క్యాన్సర్‌ ‌లాంటి ప్రాణాంతక జబ్బులు వస్తాయని, సంతాన సాఫల్య లోపం ఏర్పడుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ‘సైలెంట్‌ ‌స్ప్రింగ్‌ ఇనిస్టిట్యూట్‌’‌కు చెందిన శాస్త్రవేత్తలు మనం బయట తినే జంక్‌ ‌ఫుడ్‌లపై అధ్యయనం చేశారు.బయట దొరికే ఫుడ్‌లో కల్తీ నూనెలు ఉంటాయని, శుచీ శుభ్రం ఉండదని, అందుకని అవి ప్రమాదకరమనిఇంతకుముందు ఎంతో మంది పరిశోధకులు చెబుతూ వచ్చారు. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి.‘పీఎఫ్‌ఏఎస్‌’‌గా వ్యవహరించే మానవ తయారీ రసాయనాలు ఈ ఫాస్ట్ ‌ఫుడ్‌లలో ఉన్నట్లు తేలింది.ప్యాకేజీల ద్వారా ఆహార పదార్థాల్లోకి ఇవి వస్తున్నాయని, అలాగే ఒవెన్‌లో తయారు చేసే పాప్‌ ‌కార్న్‌లో కూడా ఈ రసాయనాలు దండిగా ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలింది.ఉద్యోగ బాధ్యతలతో వాయువేగంతో సాగిపోతోంది. ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్‌ ‌ఫుడ్‌ అని.. ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా, ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి తిని సరిపెడుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు.
వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయం లేక, మరికొందరు ఇంకోరోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు.మారిన ఆహారపుటలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో కేలరీలు కరగకపోగా, కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఇందుకోసం బరువులు ఎత్తడం, జిమ్‌లకు వెళ్లడం, కిలోమీటర్ల నడక లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులు చేయడం, వ్యాయామంతో సమానమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మానసిక ప్రశాంతత లభించడంతోపాటు,తెలియకుండానే శారీరక శ్రమ పెరిగి రెండు రకాలుగా ఉపయోగాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.సైకిల్‌ ‌తొక్కడం ఎక్కువ మందికి ఇష్టం.

వారంలో ఒక్క రోజైనా రోడ్లపై సైకిల్‌ ‌తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా సైకిల్‌పై వెళ్తే మంచిది. రోజూ అర్ధగంటపాటు సైకిల్‌ ‌తొక్కితే దాదాపు 210 కేలొరీలు తగ్గించుకున్నట్టే.    నలభై నిమిషాలపాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలొరీలు కరుగుతాయట. రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేసే వారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఆధునిక జీవనశైలితో పాటు జంక్‌ఫుడ్‌ ‌కూడా ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించింది. వద్దు వద్దని వైద్యులు ఎంత హెచ్చరిస్తున్నా ఎంతో మంది వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. జంక్‌ ‌ఫుడ్‌ ‌వల్ల అనారోగ్యం బారిన పడేవారిలో పెద్దలే కాకుండా చిన్నపిల్లలూ ఉంటున్నారు.జంక్‌ఫుడ్‌ ‌వల్ల బాలల్లో ఎనీమియా (రక్తహీనత), ఐరన్‌ ‌లోపం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పిజ్జా, బర్గర్లు, నూడుల్స్, ‌చిప్స్, ‌డోనట్స్ ‌తదితరాలు ఎక్కువగా తినే చిన్నపిల్లల్లోని రక్త నమూనాలను పరిశీలించి పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు.సుమారు  20 ఏళ్లలోపు వయసున్న వారిలో దాదాపు 40 శాతం మందిని ఎనీమియా పీడిస్తోంది.10 ఏళ్ల లోపు చిన్నారుల్లో 35 శాతం మందికి, 10-20 ఏళ్ల లోపు పిల్లల్లో 41 శాతం మందికి రక్తంలో హిమోగ్లోబిన్‌ ‌పరిమాణం చాలా తక్కువస్థాయిలో ఉంది.ప్రపంచంలో ప్రతీ వంద మంది స్థూలకాయుల్లో 19 మంది పెద్దవాళ్లు డయాబెటిక్‌కు గురవుతుంటే, ఆ సంఖ్య భారత్‌లో వందకు 38 మంది ఉండటం గమనార్హం. ఎక్కువ మందిలో స్థూలకాయంతోనే షుగర్‌ ‌వ్యాధి దరి చేరుతుంది. 1990లో మన దేశంలో 9 శాతం మంది స్థూలకాయులుంటే, 2016 నాటికి 20.4 శాతానికి చేరుకుంది. ఆ ప్రకారం 1990లో దేశంలో 2.60 కోట్ల మంది డయాబెటిక్‌ ‌రోగులుంటే, ఆ సంఖ్య 2016 నాటికి 7 కోట్లకు చేరుకుంది. అదే తెలంగాణలో 1990లో స్థూలకాయులు 15 శాతం ఉంటే, 25 ఏళ్లలో అంటే 2016 నాటికి 30 శాతానికి చేరుకోవడం విస్మయం కలిగిస్తుంది. అంటే తెలంగాణ జనాభాలో ప్రతీ వంద మందిలో 30 మంది, ప్రతీ పది మందిలో ముగ్గురు స్థూలకాయులన్నమాట. ఈ స్థూలకాయమే కొంప ముంచుతుంది.25 ఏళ్లలో స్థూలకాయులు రెట్టింపు కాగా, అదే స్థాయిలో షుగర్‌ ‌వ్యాధి బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది.

దేశంలో 2040 నాటికి 12.3 కోట్ల మంది డయాబెటిక్‌ ‌రోగులవుతారని వెల్లడించింది. దేశంలో డయాబెటిక్‌, ‌గుండె, కేన్సర్‌ ‌తదితర వ్యాధుల కారణంగానే 50 శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అది 2030 నాటికి 75 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందుకే కొవ్వును తగ్గించాల్సిన అవసరాన్ని అనేక దేశాలు గుర్తించాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, ‌జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఐర్లాండ్‌లోని కొన్ని రాష్ట్రాలు కొవ్వు పన్ను విధించాయి. కొవ్వు పన్ను ప్రధాన లక్ష్యం స్థూలకాయం, తద్వారా సంభవించే డయాబెటిక్‌, ‌గుండె వ్యాధులను తగ్గించడమేనని కేంద్రం ప్రకటించిన, పెద్దవారిలో కంటే పిల్లలపై జంక్‌ఫుడ్‌ ‌ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారంలో మూడు కంటే ఎక్కువసార్లు ఫాస్ట్‌ఫుడ్‌ ‌తినే పిల్లలకు ఆస్థమా, ఎక్సేమా వచ్చే అవకాశాలు ఎక్కువ. జంక్‌ఫుడ్‌ ‌కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి శరీరం తరచూ రోగాల బారిన పడుతుంది. చిన్న పిల్లలను పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.జంక్‌ఫుడ్‌ ‌తీసుకోవటం  అన్నది పెద్దల విషయంలో ప్రభావం చూపుతుంది.ఓ ప్రాణాంతక అలవాటుగా పరిగణించవచ్చు.
డయాబెటిస్‌, ‌గుండె జబ్బులు వంటివే కాకుండా ఆస్థమా, ఇతర అలర్జీలకు తావిస్తుంది. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో సమతుల్యత పాటించకపోవటం వల్ల ఆస్థమా పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశోధనలు తేటతెల్లం చేశాయి.పిల్లల ఆధునిక జీవనశైలి కారణంగా 25%మంది ఊబకాయంతోపాటు, మరో 33% మంది పోషకాహార లేమితో బాధపడుతున్నట్టు పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి, తాను ఆందోళనకు గురైనట్టు చెప్పారు.తాను డాక్టర్‌ను కూడా అయినందున పిల్లలకు బర్గర్లు, చిప్స్‌కు బదులు పోషక విలువలున్న సంప్రదాయ ఆహారాన్ని ఇవ్వాలని సూచిస్తున్నారు.రంగు, రుచి కోసం, ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి వివిధ రసాయనాలు వాడతారు. కొవ్వు సంబంధించిన ఆహార పదార్ధాలు తీసుకోవడంతో అనేక అనర్థాలు వస్తాయి. వాటిలో చక్కెర, ఉప్పు అధికంగా ఉంటుంది. దీంతో ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, అల్సర్‌, ‌కడుపునొప్పి, నిద్రలేమి తదితర ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పిల్లలు ఏ పని సరిగా చేయలేరు. చిరాకుతో నిరుత్సాహంగా ఉంటారు. పిల్లలు జంక్‌ ‌ఫుఢ్‌ ‌తీసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.

 – మోటె చిరంజీవి,
సామాజికవేత్త, మదర్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌.సెల్‌ : 9949194327.

Leave a Reply