Take a fresh look at your lifestyle.

హైదరాబాదీలతో జరంత భద్రం… నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

కరోనా మహమ్మారి జూలై మాసంలో జూలు విదిలించనున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి పట్ల హైదరాబాద్‌ ‌నుండి నియజకవర్గానికి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజల శ్రేయస్సుకై కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునే బాధ్యతగా మూడు రోజుల క్రితమే నర్సంపేటలోని వాసవి కళ్యాణ మండపంలో రెవెన్యూ, పోలీస్‌, ‌పంచాయతి రాజ్‌, ‌వైద్య, ఆరోగ్య శాఖ అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్‌ అమలుచేస్తారన్న వార్తలను చూసిన తర్వాత హైదరాబాద్లో నివాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి సొంత గ్రామాలకు, తండాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ క్రమంలో రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి హైదరాబాద్లో నివసించేటువంటి వారు వస్తున్నట్లు ఆయన తెలిపారు. వాళ్లకి సంబందించి క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎం‌లు, పంచాయతి కార్యదర్శి, విలేజ్‌ ‌పోలీస్‌ ఆఫీసర్‌ ‌వాళ్లని గుర్తించి, ఎలాంటి లక్షణాలు ఉన్న, జాగ్రత్త వహించి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలనీ సూచించారు.

ప్రత్యేకంగా వారిని హోమ్‌ ‌క్వారంటైన్‌ ‌చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దన్నారు. కరోనా మహమ్మారి జూలై మాసంలో మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు నిష్ణాతులు ప్రకటిస్తున్నారన్నారు. ఇప్పటివరకూ వరకూ గ్రీన్‌ ‌జోన్‌ ‌లో ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గంలోకి మూడు రోజుల నుంచి రావడమే కాకుండా ఇంకా వచ్చేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారన్నారు. ఇదే పద్ధతిలో సీజనల్‌ ‌వ్యాధులు, వైరల్‌ ‌ఫీవర్‌తో వచ్చే వర్షాకాలం కూడా ప్రారంభమైన సందర్భంగా గ్రామ సర్పంచ్లు, ఎంపిటిసి సభ్యులు, మండల స్థాయిలో జెడ్పిటిసిలు, ఎంపిపిలు, నిత్యం పర్యవేక్షణ చేసి దీని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనీ ఆయన సూచించారు. ప్రత్యేకంగా హరితహారం సందర్భంగా ఉపాధి హామీ పనులలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబందిత బాధ్యులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రతి గ్రామంలో హెల్త్ ‌కు సంబంధించి ప్రతి సమాచారం నిమిత్తం ప్రత్యేకంగా వాట్సప్‌ ‌గ్రూపులు కూడా రూపొందిస్తున్నామన్నారు.

Leave a Reply

error: Content is protected !!