అమర్యాదగా మాట్లాడితే ఊరుకునేది లేదు
పేడ పిసకడం అలవాటును మరవలేదేమో
మంత్రి తలసానిపై మండిపడ్డ రేవంత్ రెడ్డి
సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా.. ఎవరేం పిసుకుతారో చూద్దాం. కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..? మంత్రిగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని
మాట్లాడాలని ఘాటు హెచ్చరిక చేశారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుందని రేవంత్ సూచించారు. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్ పరాగ్‌లు నమిలే వారు కూడా తన గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదన్నారు. ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. నేను పీసీసీసీ అధ్యక్షుడిని. తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా నా స్థాయికి రాలేరని పేర్కొన్నారు.
తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ఎందుకు ప్రకటించారో వారికే తెలియాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య భారతంలో దేశాన్ని 45-50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి.. పేదలకు రూ.2 వేల పింఛన్, 24 గంటల కరెంట్, ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిన పాపం కాంగ్రె?సదేనని ఆరోపించారు. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయ చేయడం తప్ప.. అభివృద్ధి చేశామని ఓట్లడిగే దమ్ము బీజేపీకి లేదని విమర్శించారు. యజ్ఞాలు, యాగాలు చేయడమే కాకుండా.. యాదాద్రి వంటి గొప్ప దేవాలయాన్ని నిర్మించిన కేసీఆర్ కంటే గొప్ప హిందువు దేశంలో ఎవరూ లేరని అన్నారు. ‘ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతదిఽ అని పరోక్షంగా రేవంత్‌రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వి•టింగ్ హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదు.. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని రేవంత్ రెడ్డి హచ్చరించారు. పశు కాపరిగా ఉన్నాడు కాబట్టి తలసానికి పేడ పిసకడం అలవాటు అయినట్లుంది..
అందుకే తనను పిసుకుతాను అంటున్నాడని రేవంత్ ఎద్దేవ చేశారు. చిన్ననాటి నుండి ఆయనకు పేడ పిసకడం అలవాటుగా ఉన్నట్లుందని వ్యాఖ్యనించారు. పాన్ పరాగ్ లు నమిలే వ్యక్తి తనపై మాట్లాడడం సరికాదని..మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.. రాజకీయాలలో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండడం నేర్చుకోవాలని హితవు పలికారు. కంటోన్మెంట్ బోర్డు వి•టింగ్ లో దీర్ఘకాలంగా ఉన్న అంశాలపై బోర్డ్ లో చర్చించామని రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రహదారులను తెరవాలని, నాలా సమస్యలను పరిష్కరించాలని చర్చ జరిగిందని వెల్లడించారు. సివరెజ్ వ్యవస్థ సరిగా లేదు.. కంటోన్మెంట్ లో సివరేజ్ ఎ•-లాంట్ ప్రణాళిక ఏర్పాటు చేయాలని..కలుషిత నీటి వల్ల నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. కోర్టుకు వెళ్లి అయిన దీనిపై పోరాడాలన్నారు. కంటోన్మెంట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తుందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి రక్షణ శాఖ మంత్రితో సమన్వయం చేసుకుంటు కంటోన్మెంట్ సమస్యలను తీర్చాలని రేవంత్ రెడ్డి కోరారు.