Take a fresh look at your lifestyle.

బి.సి.సి.ఐ నిర్ణయం హర్షణీయం

బి.సి.సి.ఐ – బోర్డ్ ఆఫ్‌ ‌కంట్రోల్‌ ‌ఫర్‌ ‌క్రికెట్‌ ఇన్‌ ఇం‌డియా, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్‌ ‌బోర్డు, ప్రపంచ క్రికెటను శాసించే మేటి బోర్డు. ఎన్నో చిన్నదేశాలకు బి.సి.సి.ఐ ఆశాదీపం. ఇండియాతో క్రికెట్‌ ఆడితే చాలు అని అనుకునే పసికూనలెన్నో. ఇతర దేశాల ఆర్థిక స్థితిగతులను మార్చే దమ్మున్న బోర్డు.ఆఫ్గనిస్థాన్‌, ‌జింబాబ్వే వంటి దేశాలకు ఆర్థికంగా సహాయపడుతూ క్రికెట్‌ ‌ను కాపాడుతున్న గొప్ప మనసున్న బోర్డు. ఇలాంటి బి.సి.సి.ఐ మొన్నటి వరకు సామాజిక న్యాయం పాటించదు అనే మాయని మచ్చను మోస్తూ వచ్చింది. స్త్రీ,పురుష ఆటగాళ్ళకు సమానమైన హక్కులు లేవనే అభియోగాన్ని మోస్తూవచ్చింది. కానీ నిన్నటి నిర్ణయంతో ఇప్పటి వరకు ఉన్న అభియోగాలన్నింటినీ పటాపంచలు చేసింది.

తాజాగా బి.సి.సి.ఐ మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్‌ ‌ఫీజులను ఇవ్వాలని, ప్రస్థుతంగా ఉన్న ఫీజులకు ఆరు రెట్లు ( టెస్టు, వన్డేలకు), అలాగే టి20లకు మూడు రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా టెస్టు, వన్డే, టి20లకు 15 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు మ్యచ్‌ ‌ఫీజుగా మహిళా క్రికెటర్లు పొందనున్నారు. ఈ నిర్ణయంతో బి.సి.సి.ఐ సామాజిక న్యాయంలో మరో అడుగు ముందుకేసింది. ఈ పరిణామంతో మహిళలకు తగిన సాధికారత లభిస్తుంది. ఆర్థికంగా బలపడటానికి ఇది తోడ్పడుతుంది. మహిళ క్రికెట్‌ ‌రంగం ఉన్నతికి ఇదో మైలురాయి. బి.సి.సి.ఐ సెంట్రల్‌ ‌కాంట్రాక్ట్ ‌లో కూడా మార్పులు అవసరం. ఇందులో మహిళలకు ఎలాంటి మార్పు జరగలేదు. ముందుగా స్త్రీ,పురుష ఆటగాళ్ళకు సమాన వేతనాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న న్యూజీలాండ్‌ ‌దేశాన్ని ఆదర్శంగా తీసుకొని బి.సి.సి.ఐ తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం.
– శ్రీకాంత్‌ ‌చెర్వుగట్టు, 91 9491533693

Leave a Reply