Take a fresh look at your lifestyle.

బిసి జాబితా అధికారం ఇక ముందు రాష్ట్రాలదే

  • ఓబిసి రిజర్వేషన్ల సవరణ బిల్లుకు విపక్షాల మద్దతు
  • లోక్‌సభ ముందుకు 127వ రాజ్యాంగ సవరణ బిల్లు
  • ప్రవేశపెట్టడంపై సభ్యుల హర్షం..బిల్లుపై కొనసాగిన చర్చ
  • తెలంగాణలో, ఇతర రాష్ట్రాలలో పెండింగ్‌లో ఉన్న కులాలను కూడా చేర్చాలి : ఎంపి బీబీ పాటిల్‌
  • ‌యూపి ఎన్నికల దృష్ట్యానే ఓబిసి బిల్లు : ఓబిసిపై చర్చలో కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌

రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్‌ ‌సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న క్రమంలో వెనుకబడిన తరగతులకు ఒబిసి రిజర్వేషన్ల విషయంలో విపక్షాలు కేంద్రానికి సహకరించి చర్చకు వొచ్చాయి. ఆయా రాష్ట్రాలకు హక్కు కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అంతకుముందే మద్దతు ప్రకటించడంతో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా చర్చలో పాల్గొన్నాయి. నిజానికి పెగాసస్‌ ‌వ్యవహారం, నూతన సాగు చట్టాల రద్దు అంశంలో రెండు వారాల నుంచి పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. మంగళవారం కూడా విపక్షాలు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున్‌ ‌ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొని బిల్లుకు మద్దతు ప్రకటించారు. ఒబిసి బిల్లుకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌధురీ వెల్లడించారు. టిఆర్‌ఎస్‌ ఎం‌పి బిబి పాటిల్‌, ‌బిజూ జనతాదళ్‌ ఎం‌పి రమేశ్‌ ‌చంద్ర, లోక్‌ ‌జనశక్తి పార్టీ ఎంపి ప్రిన్స్ ‌రాజ్‌, ‌జెడి(యు) ఎంపి రాజీవ్‌ ‌రంజన్‌ ‌సింగ్‌లు బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో రిజర్వేషన్ల సమస్యను పరిష్కరిస్తుందని ప్రిన్స్ ‌రాజ్‌ అన్నారు. కాగా, శివసేన ఎంపి వినాయక్‌ ‌రౌత్‌.. ‌మరాఠాల రిజర్వేషన్లపై మాట్లాడుతూ..సుప్రీమ్‌కోర్టు అక్షింతలు వేసిన తర్వాతే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు.

కులాల వారీగా జనగణన చేపట్టాల్సిందిగా వైసిపి ఎంపి బి.చంద్రశేఖర్‌ ‌కేంద్రాన్ని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన తృణమూల్‌ ‌పార్టీ ఎంపి సుదీప్‌ ‌బంధోపాధ్యాయ పెగాసస్‌ ‌వి•ద కూడా చర్చకు ఒప్పుకొంటే..ఇప్పుడు జరుగుతున్నట్టే సమావేశాలు సాఫీగా సాగుతాయని అన్నారు. 30 బిల్లులను కేవలం 10 నిమిషాల్లోనే ఎలా పాస్‌ ‌చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం 11 శాతం బిల్లులనే కమిటీలు పరిశీలించాయన్నారు. ఒబిసిల రిజర్వేషన్ల కోసం డిఎంకె పోరాడిందని ఆ పార్టీ ఎంపి టిఆర్‌ ‌బాలు పేర్కొన్నారు. కాగా, పెగాసస్‌, ‌రైతు చట్టాల రద్దు వంటి అంశాలపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత లోక్‌సభలో చర్చ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళన చేయడంతో రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్‌లో పలు బిల్లులు ఆమోదించే సమయంలో పలువురు బిజెపి ఎంపిలు గైర్హాజరయ్యారు. దీంతో ప్రధాని మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణలో, ఇతర రాష్ట్రాలలో పెండింగ్‌లో ఉన్న కులాలను కూడా చేర్చాలి : ఎంపి బీబీ పాటిల్‌
ఈ ‌బిల్లుపై తెలంగాణ ఎంపీ బీబీ పాటిల్‌ ‌మాట్లాడుతూ ‘‘తెలంగాణలో 40 కులాలు అలాగే ఇతర రాష్ట్రాలలో మరికొన్ని కులాలు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా తమ కులాలను ఓబిసి లిస్టులో చేర్చవలసిందిగా కోరుతున్నాయి. తెలంగాణలోని ఎనిమిది నుంచి పది కులాలు చిన్న చిన్న స్పెల్లింగ్‌ ‌మిస్టేక్‌ ‌వలన ఓబీసీ లిస్టులో చేరకుండా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చిన్న చిన్న స్పెల్లింగ్‌ ‌మిస్టేక్‌లను పరీక్షించి ఆయా కులాలను కూడా ఓబీసీ లిస్టులో చేర్చమని కోరుతున్నాను. తెలంగాణలో వీరశైవ, లింగాయత్‌, అరేవాళ్ళు, ఆరోలు, కులాల వాళ్ళు తమ కులాలను ఓబీసీ లిస్టులో చేర్చడానికి ఏళ్ల తరబడి అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అని కోరుతున్నాను’’ అని అన్నారు. అలాగే ఓబీసీ లకి సంబంధించి ప్రత్యేక మంత్రాలయ ఏర్పాట్లు చేయాలని కూడా కోరారు.

యూపి ఎన్నికల దృష్ట్యానే ఓబిసి బిల్లు : ఓబిసి పై చర్చలో కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌
‌యూపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓబిసి రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తెచ్చిందని లోక్‌సభలో కాంగ్రెస్‌ ఆరోపించింది. పెగాసస్‌ ‌వ్యవహారంతో అసలు కార్యకలాపాలు స్తంభించిన వేళ ఓబిసి బిల్లు ప్రవేశ పెట్టడంతో జరిగిన చర్చలో కాంగ్రెస్‌ ‌పాల్గొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌పక్షనేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరీ మాట్లాడుతూ యూపీ ఎన్నికల నేపథ్యంలో ఈ బిల్లును తెచ్చినట్లు ఆరోపించారు. రిజర్వేషన్లపై సీలింగ్‌ను పెంచాలని చాలా రాష్టాల్రు భావిస్తున్నట్లు అధిర్‌ ‌తెలిపారు. కుల వ్యవస్థ ఉన్నందు వల్లే దేశంలో రిజర్వేషన్లు అవసరం ఉందన్నారు. లోక్‌సభలో మంగళవారం రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. స్పీకర్‌ ఓం ‌బిర్లా కోరిక మేరకు విపక్ష సభ్యులు సభలో నినాదాలు ఆపేశారు. దీంతో ఆ బిల్లుపై చర్చ మొదలుపెట్టారు. మంత్రి వీరేంద్ర కుమార్‌ ఆ ‌బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఓబీసీ జాబితా తయారు చేసేందుకు రాష్టాల్రకే అధికారం ఇచ్చే రీతిలో ఓబీసీ సవరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ సవరణ బిల్లు వల్ల దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో సుమారు 4వేల మంది ఓబీసీలకు సీట్లు దక్కనున్నాయి. ఇది కీలకమైన బిల్లు కాబట్టే తాము చర్చలో పాల్గొంటున్నామని అధీర్‌ ‌రంజన్‌ అన్నారు. ఈ బిల్లు పాస్‌ ‌కావాలంటూ మూడవ వంత సభ్యులు కూడా అవసరమన్నారు. విపక్షాలే సభను అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం చెబుతుందని, కానీ ప్రజల బాధలను వెలుగులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు. పంచాయతీ రాజ్‌ ‌చట్టం అమలులో రాజీవ్‌ ‌గాంధీ పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఓబీసీ జాతీయ కమిషన్‌ 2018‌లో రాష్ట్రాల హక్కులను తీసుకున్నదని, వి•రు చేసిన తప్పునే ఇప్పుడు మళ్లీ సరిదిద్దుతున్నట్లు చెప్పారు. అణగారిన వర్గాలను అభివృద్ధిపరిచేందుకు రిజర్వేషన్‌ ‌వ్యవస్థ తప్పదని అధిర్‌ ‌తెలిపారు. జ్యోతిరావ్‌ ‌పూలే గురించి కాంగ్రెస్‌ ‌నేత మాట్లాడారు. మరాఠా రిజర్వేషన్ల గురించి చెప్పిన అధిర్‌..‌మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న సీలింగ్‌ను రద్దు చేయాలని ఆయన కోరారు. అధిర్‌ ‌రంజన్‌ ‌మాట్లాడుతున్న సమయంలో సభలో సోనియా గాంధీ కూడా ఉన్నారు.

Leave a Reply