Take a fresh look at your lifestyle.

బీసీ కులగణన ఇంకెన్నాళ్లకు ?

స్వాతంత్య్రానికి ముందు,స్వాతంత్య్ర అనంతర కాలంలోనూ మెజార్టీలుగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. రాజ్యాంగ సభలో బీసీలకు ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల విద్య,ఉద్యోగ, రాజకీయాల్లో రక్షణలు కల్పించలేకపోయారు. స్వాతం త్రానంతరం తమిళనాడులో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం వల్ల మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు అవకాశం లభించినప్పటికి ఇతర వెనుకబడిన తరగతులకు అవకాశం లభించలేదు.దేశవ్యాప్తంగా బీసీ స్థితి గతులపై కమిషన్‌ ‌వేసే అవకాశం ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం నిర్లక్యం చేసింది. ప్రభుత్వం పై తీవ్రమైన ఒత్తిడి రావడం వల్లనే మొదటి ఇతర వెనుకబడిన తరగతుల కమిషన్‌ ‌కాకా కాలేల్కర్‌ అధ్యక్షత ఏర్పాటు చేసింది. కానీ కమిషన్‌ ‌సిఫారసులను నాటి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. తరువాత 25 సంవత్సరాలు నాటి ప్రభుత్వాలు బీసీల గురించి పట్టించుకోలేదు .జనతా ప్రభుత్వ కాలంలో మండల్‌ ‌కమిషన్‌ ‌లను నియమించినా,కమిషన్‌ ‌రిపోర్టును తదుపరి ప్రభుత్వాలు అట్టకెక్కించాయి.

నేషనల్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లకు మోక్షం లభించింది.అంటే స్వాంతంత్య్ర అనంతరం నలభై మూడు సంత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశం లేకుండా,60 సంవత్సరాలు విద్యా సంస్థలలో అవకాశాలు లేకుండా బీసీలను ప్రభుత్వాలు అనాథలుగా మిగిలిల్చాయి. అదే అగ్రకులాలకు చెందిన పేదలకంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేవలం మూడు రోజుల్లో రిజర్వేషన్లు కల్పించారు.మొదటిరోజు లోక్‌ ‌సభలో,రెండో రోజు రాజ్యసభలో, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం చేయగానే అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు చట్టంగా మారింది. విద్య ,ఉద్యోగాల్లో మెజార్టీగా ఉన్న బీసీలకు అన్యాయమే జరిగింది. ఇందిరా సహాని కేసు సందర్భంగా మెజార్టీ ధర్మాసనం ఓబీసీ రిజర్వేషన్ల కోసం జనగణనలో కులగణన చేయాలని ఆదేశిం చింది.అనేక రాష్ట్ర స్థాయిలో నియమించబడ్డ సుమారు 200 పైగా బీసీ కమిషన్లు కూడా బీసీ కులగణన చేయాలని పేర్కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మనదేశంలో చెట్లకు,పుట్టలకు లెక్కలు ఉన్నాయి, కానీ మెజారిటీగా ఉన్న ఓబీసీలకు లెక్కలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వివిధ అభివృద్ధి పథకాల రూపకల్పన కోసం కులగణన అవసరం. ఈ గణన లేకపోవడం వల్లనే బీసీ రిజర్వేషన్లను ఇటు హైకోర్టులు,అటు సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో కొట్టి వేస్తూనే ఉన్నాయి. గ్రామపంచాయతీ వార్డ్ ‌మెంబర్‌ ‌నుంచి సర్పంచ్‌,ఎం‌పీటీసీ, జడ్పిటీసి, కౌన్సిలర్‌,‌చైర్మన్‌ ‌పదవుల వరకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ జనాభా లెక్కలు సక్రమంగా లేకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. బీసీ జనాభా లెక్కలు లేకపోవటం వల్ల నిధుల కేటాయింపులలో వివిధ కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

ఎన్‌ ‌టి రామారావు ప్రభుత్వ సమయంలో మురళీధరరావు కమిషన్‌ ‌సిఫారసుల మేరకు బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని జీవో జారీ చేసినప్పటికీ జనాభా లెక్కలు లేకపోవడం వల్ల హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించాలని జస్టిస్‌ ‌రోహిణి కమిషన్‌ ‌నియమించినా, గ్రూపుల వర్గీకరణ జనాభా లెక్కలు లేకపోవడం వల్ల సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం దేశంలో 19 రాజకీయ పార్టీలు బీహార్‌,‌మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రులు తమతమ అసెంబ్లీలలో తీర్మానం చేసి బీసీ కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ,బీహార్‌ ‌ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిల పక్ష బృందం ప్రధాని ని కలసి అభ్యర్థించినప్పటికి కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణనకు నిరాకరింస్తుంది.2011లో బీసీ కులగణనకు బిజెపి పార్టీ నాటి ప్రతిపక్షంగా డిమాండ్‌ ‌చేసినప్పటికీ ప్రస్తుతఎందుకు వెనకాడు తున్నట్లు?. 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన రిపోర్టు 2014లో కేంద్ర ప్రభుత్వానికి అందినప్పటికి ఇప్పటికి ఆ లెక్కలను ఎందుకు బయటపెట్టలేక పోతున్నారు.?ఆ లెక్కలల్లో తప్పులు దొర్లాయని పేర్కొంటునప్పుడు విశ్వసనీయమైన భారత గణాంక సంస్థకు ఆ బాధ్యత అప్పగించవచ్చుగా?

2018లో నాటి హోం మినిస్టర్‌ ‌రాజ్సిం నాథ్‌ ‌సింగ్‌ 2021‌లో జనగణనలో బీసీ కులగణన చేపడుతామని ప్రకటించినప్పటికీ, 2019లో స్వయంగా ప్రధానమంత్రి జనగణనలో బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఎందుకు తిరస్కరిస్తునట్లు.? 2019 సెప్టెంబర్‌ ‌నాటికే జనగణన ప్రశ్నావళి తయారై యింది ఇప్పుడు సాధ్యం కాదంటే 2018 లో ఇచ్చిన మాట మరిచినట్లా?.మత గణన వల్ల రాని సమాజంలో విభజన కులగణన వల్ల వస్తుందా?రాజకీయాల్లో సోషల్‌ ఇం‌జనీరింగ్‌ ‌చేస్తున్నది ఎవరు? సోషల్‌ ఇం‌జనీరింగ్‌ ‌కు లేని అభ్యంతరం కులగణన కు ఎందుకో వారే చెప్పాలి?ఓబీసీల సమాచారం కోసం ఇప్పటికి 1931నాటి జనగణనపై ఆధారపడలా? కోర్టులు, మెజార్టీ పార్టీలు 90% ప్రజలు కోరుతున్న బీసీ కులగణన చేపట్టకూడదనేది విధానపర నిర్ణయం అన్నప్పుడు మీ నిర్ణయాలు మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయని భావించాలా? కుల గణన చేస్తే బీసీల జనాభా తెలుస్తుందని,వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పొందుతున్న ప్రయో జనాలు అతిస్వల్పమనే విషయం బహిర్గతం అవుతుందని బయపడు తున్నారా?ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం 43 సంవత్స రాలు, విద్య సంస్థలో రిజర్వేషన్ల కోసం 60 సంవత్సరాలు పోరాడిన బీసీలు కులగణన కోసం ఇంకెన్ని సంవత్సరాలు ఉద్యమించాలి? స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా మెజార్టీ బీసీ ప్రజల జనాభా లెక్కలు లేకపోవడం వల్లే ఇతర కులాలు మెజార్టీ బీసీ కులాలపై అధికారం చేలాయిస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో కూడా ఆధిపత్యం ఇంకా కొనసాగుతుంది. దీనికి చరమగీతం పాడాలంటే జనగణనలో బీసీ కులగణన వల్లనే సాధ్యం.
– జుర్రు నారాయణ యాదవ్‌
‌మహబూబ్‌నగర్‌, 9494019270.

Leave a Reply