Take a fresh look at your lifestyle.

బతుకమ్మా…వెళ్లిరావమ్మా

బతుకమ్మా…బతుకమ్మా
మా కంటి వెలుగువు నీవు
మా ఇంటి ఇలవేలుపు నీవు
మా గుండెల సవ్వడి నీవమ్మా
మా బతుకు మెతుకు నీవమ్మా
తెలంగాణ జయ హారతి నీకమ్మా
!! బతుకమ్మా ….

ఉద్యమ స్ఫూర్తివి నీవు
అమరత్వాల దీప్తివి నీవు
త్యాగాల ఘనతవు  నీవు
వీరత్వాల చరితవు నీవమ్మా
బహు జన నీరాజనం నీకమ్మా
!!బతుకమ్మ

ఆస్తిత్వ ప్రతీక నీవు
ఆత్మ గౌరవ పతాక నీవు
సంస్కృతుల వేడుక నీవు
జీవన ముఖచిత్రం నీవమ్మా
సకల జను నమస్సులు నీకమ్మా
!!బతుకమ్మా

పుడమి పూల  సింగిడి  నీవు
అతివల పూజల సందడి నీవు
పల్లెపట్టణాల సంబరము  నీవు
శ్రమ జీవన సౌందర్యం నీవమ్మా
సబ్బండ వర్గాల శరణార్థి నీకమ్మా
!! బతుకమ్మా

కరుణించి తల్లివి నీవు
వరాలిచ్చే కల్పవల్లివి నీవు
దీవెనలందించే దేవత  నీవు
సకల జగతికి మూలం నీవమ్మా
మాకోసం మళ్లీరావమ్మా  బతుకమ్మ
బతుకునిచ్చు మా బంగారు బతుకమ్మా
తెలంగాణ ప్రజావళి ప్రణతి మీకోయమ్మా
(బతుకమ్మ నిమజ్జనోత్సవం సందర్భంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply