Take a fresh look at your lifestyle.

నేటినుంచి బతుకమ్మ చీరల పంపిణీ

ఇప్పటికే జిల్లాలకు చేరిన చీరలు
మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభం

‌తెలంగాణలో బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమైంది. అర్హులైన కోటిమంది మహిళలకు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చీరెలు అందించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెల్లరేషన్‌ ‌కార్డులో పేరుండి, 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరెలను అందిస్తారు. మరమగ్గాలపై తయారుచేసిన ఈ చీరెలను 33 జిల్లాలకు చేర్చారు. ఈసారి 287 డిజైన్లతో ఆకర్షణీయంగా తయారు చేశారు. బంగారు, వెండి జరీతో తీర్చిదిద్దారు. తయారీకి రూ.317 కోట్లు వెచ్చించారు.

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని చీరెలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు స్వయం సహాయక సంఘాల ద్వారా భౌతిక దూరాన్ని పాటిస్తూ చీరెలను ఇంటింటికీ పంపిణీచేయనున్నారు. బతుకమ్మ చీరెల తయారీ, పంపిణీ వెనుక ముఖ్యమంత్రి ద్విముఖ వ్యూహం అనుసరించారు. సిరిసిల్ల, ఘర్షకుర్తి, వరంగల్‌లో మరమగ్గాలపై చీరెలను తయారు చేయించారు. మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటం, అదే సమయంలో అడపడుచులకు చిరుకానుక అందించటం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశం. ఈ చీరెల తయారీతో ఆరు నెలలపాటు 15వేల మంది నేతన్నలకు రెండు షిఫ్టుల్లో పనిదొరికేలా చేసింది.  ఈ ఏడాది మొత్తం 98.50 లక్షల చీరెలు అవసరమవుతాయని అంచనా వేసి జిల్లాలకు చేరవేశారు. ఇందులో 89,28,700 చీరెలు 6.30 వి•టర్లవి కాగా,  9,21,300 చీరెలు 9 వి•టర్లవి ఉన్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply