Take a fresh look at your lifestyle.

 ‌పార్టీకి, ఏఎంసి పదవీకి రాజీనామా యోచనలో ‘బట్టు’?

గజ్వేల్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో పెరుగుతోన్న అసంతృప్తి
సిద్ధిపేట జిల్లా దుబ్బాక బై ఎలక్షన్‌ ‌ఫలితం అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీని అతలాకుతలం చేస్తూనే ఉంది.  అంతర్గతంగా ఉన్న అసంతృప్తి మెల్ల మెల్లగా బయటకు పొక్కేలా చేస్తోంది. మొన్నటి వరకు లోలోపల ఉన్న అసంతృప్తి , అసమ్మతి కాస్త దుబ్బాక ఫలితం పుణ్యమా అని ఒక్కొక్కటిగా  బయటపడేలా చేస్తున్నాయి. ఆ పార్టీని వీడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాలు ఆదివారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నా పదవులు దక్కక, ప్రాధాన్యత, గౌరవం లేకపోవడంతో పలువురు నేతలు  పార్టీ అధిష్టానంపై అసంతృప్తి, అసమ్మతితో వీలైనంత త్వరగా పార్టీని వీడాలని అనుకుంటుండగా… ప్రోటోకాల్‌ ‌పదవీలో ఉన్నప్పటి కనీసం గౌరవ, మర్యాదలు ఇవ్వకుండా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ మరికొందరు నేతలు టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి దూరం కావాలన్న యోచనలో ఉన్నారనీ విశ్వసనీయ సమాచారం. పార్టీ నేతలు నేతలు పార్టీ అధిష్ఠానంపై అసమ్మతితో రగిలిపోతున్నారా? అంటే తాజా పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు, టిఆర్‌ఎస్‌లోని సీనియర్‌ ‌నాయకులు, ఉద్యమకారులు. ఇన్నాళ్లు ఎలాంటి చడీ చప్పుడు చేయకుండా ఉన్న నేతలంతా దుబ్బాక బై ఎలక్షన్‌లో ఫలితం తారుమారు కావడంతో  దాచుకున్న అసంతృప్తి, అసమ్మతిని ఒక్కసారిగా  వెళ్లగ్కడానికి అన్ని విధాలుగా మానసికంగా సిద్ధమయ్యారనీ తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో గజ్వేల్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ వైస్‌ ‌ఛైర్మన్‌, ‌తీగుల్‌ ‌మాజీ సర్పంచి, టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బట్టు సుధాకర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, వైస్‌ ‌ఛైర్మన్‌ ‌పదవీకి రాజీనామా యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు తన రాజీనామా గురించి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకుడు, గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. గజ్వేల్‌ ఏఎం‌సి వైస్‌ ‌ఛైర్మన్‌గా ప్రోటోకాల్‌ ‌పదవీలో ఉన్నప్పటికీ..తనను మార్కెట్‌ ‌కమిటీలో జరిగే ప్రోగ్రాంలలో సైతం కనీసం పట్టించుకోనప్పుడు పార్టీలో, వైస్‌ ‌ఛైర్మన్‌ ‌పదవీలో ఉండి ఏం లాభమనీ సుధాకర్‌రెడ్డి రాష్ట్ర, గజ్వేల్‌ ‌నేతల వద్ద తన మనసులోని అసంతృప్తిని  వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ నెల 13న రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు గజ్వేల్‌లోని ఏఎంసి కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైనప్పుడు స్థానికంగా ఉన్న కొందరి వల్ల తనకు జరిగిన అవమానంపై సుధాకర్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.  నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఇచ్చినంతగా ప్రాధాన్యత, గౌరవ, మర్యాదలు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారికి లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమనీ, ఈ వైస్‌ ‌ఛైర్మన్‌ ‌పదవీలో కొనసాగలేననీ పార్టీ నేతల వద్ద తన బాధల్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో సుధాకార్‌రెడ్డి  కూడా పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారనీ సమాచారం. సుధాకర్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్‌ఎస్‌లో ఉండటంకంటే ఆ పార్టీని వీడటమే బెటర్‌ అన్న ఆలోచనకు వచ్చారనీ తెలుస్తుంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారితో పాత నేతలు, ఉద్యమకారులు అడ్జెస్ట్ ‌కాలేకనే అసంతృప్త, అసమ్మతీ రోజు రోజుకూ పెరుగుతుందనీ సమాచారం. అసంతృప్తి, అసమ్మతీయుల సంఖ్య పెరుగుతున్నా కూడా సముదాయించే  వారెవరూ లేకపోవడంతో అసంతృప్త, అసమ్మతి  నేతలందరూ బిజెపి పార్టీలోకి వెళ్లేందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారనీ జోరుగా ప్రచారం సాగుతోంది. చూడాలి మరి!

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply