Take a fresh look at your lifestyle.

బతుకమ్మ యేడికి బోయింది?

“‌తెలంగాణ అచ్చినంక యేం ఫాయిదయింది!? గీ తొమ్మి ద్దినాలు టీ.వీల కానచ్చే దొరసాని బతుకమ్మే బతుకమ్మ!బంగారు తెలంగాణల బతుకమ్మ మీద టీ.వీలల్ల యాంకరమ్మల తీరొక్క కవిత్వాలు గిట్ల జోరుగ్గానత్తయి.ఒక్క తెలంగాణలనే కానచ్చే తీరొక్క పూలపండుగ బతుకమ్మ! మారేటి కాలాలు తెచ్చేటి పండుగలల్ల యాడాదంత యెదురుజూషేటి బతుకమ్మ మనతెలంగాణ ఆడోళ్ళపండుగ!తొమ్మిది దినాలు తెలంగాణల తంగెడిపూల జాతర బతుకమ్మ! మేదరోళ్ళ శిబ్బిల తీరొక్క పూల మద్దెన కొలువుండేటి గౌరమ్మ ఆకరి దినాన గంగమ్మల కలిషేటి సద్దుల బతుకమ్మ, తెలంగాణల అవ్వల్‌ ‌దర్జాపండుగ!బస్తీలల్ల కొలువయ్యేటి   బతుకమ్మ యెవలి పాలయింది!? బతుకమ్మ యేడికి బోయింది?”

మన తెలంగాణ మనకత్తె యేమయితది!? శానశాన అయితదన్నం గద!అయితాంది, బగ్గనే సూత్తానం గద!దొరల గడీల కేలి వూళ్ళెకు దెచ్చిన బతుకమ్మ మళ్ళ గడీల పాలయింది.దొరలరాజ్జెమంటె బూముల్నే గాదుల్లా!గీ బూమిల బుట్టిన మన ఆటపాటల ఆచారాలను, సంస్కృతిని సుత దోసుకుంటరు. గవన్ని మనకు ఊపిరాసొంటియని గాళ్ళకెరికె! గవుంటె మనం మళ్ళ పానంబోసుకోని వరికంకులోలిగె మర్లబడ్తవన్న బుగులుంటది. మన యేషం, మన బాసల గాళ్ళు కాళ్ళు బెట్టుడంటెనే మనల్ని పానాలు బోయెదాంక బొందవెట్టే కతలు బడుడని యెరుకుండాలె! ‘‘కడుపునిషం!నాల్కెన తీపంటె గీదేనుల్లా’’!
తెలంగాణ అచ్చినంక యేం ఫాయిదయింది!? గీ తొమ్మి ద్దినాలు టీ.వీల కానచ్చే దొరసాని బతుకమ్మే బతుకమ్మ!బంగారు తెలంగాణల బతుకమ్మ మీద టీ.వీలల్ల యాంకరమ్మల తీరొక్క కవిత్వాలు గిట్ల జోరుగ్గానత్తయి.ఒక్క తెలంగాణలనే కానచ్చే తీరొక్క పూలపండుగ బతుకమ్మ! మారేటి కాలాలు తెచ్చేటి పండుగలల్ల యాడాదంత యెదురుజూషేటి బతుకమ్మ మనతెలంగాణ ఆడోళ్ళపండుగ!తొమ్మిది దినాలు తెలంగాణల తంగెడిపూల జాతర బతుకమ్మ! మేదరోళ్ళ శిబ్బిల తీరొక్క పూల మద్దెన కొలువుండేటి గౌరమ్మ ఆకరి దినాన గంగమ్మల కలిషేటి సద్దుల బతుకమ్మ, తెలంగాణల అవ్వల్‌ ‌దర్జాపండుగ!బస్తీలల్ల కొలువయ్యేటి   బతుకమ్మ యెవలి పాలయింది!? బతుకమ్మ యేడికి బోయింది?
ఈ కాలపిల్లగాండ్లకు షెరిత్ర యెరుక లేకుంటె తప్పెవల్ది!?బతుకమ్మంటె యెరుకుండాలె గద!గీ ముచ్చటంత జెప్పాలె! ‘‘వారీ! బతుకమ్మంటె గిది’’!అని ఇగురం ఇప్పి జెప్పాలె! తెలంగాణల తొమ్మిద్దినాల పూల పండుగ బతుకమ్మంటె దొరల పెత్తనాన్ని సవాలు జేషిన ఆడోళ్ళ వీరత్వపు ప్రతీక. తెలంగాణల దొరల దొరీర్కం మీద ఆడబడుసులంత మర్లవడ్డ తంగెడుపూల పండుగ బతుకమ్మ.దొరల గడీల మీద,గాళ్ళ పెద్దరికాల మీద సవాల్‌ ‌జేషిన అవ్వలందరు ఏకమయి షేతిల షెయ్యేషిన పోరు పతాక బతుకమ్మ పండుగ.ఉన్నోళ్ళు,లేనోళ్ళనేది లేకుంట గల్మ గల్మకు పూవులద్దేటి సంబురాల పండుగే బతుకమ్మ.

ఏ దొరల రాజ్జెం కూలనీకి గునుగుపూలు గుమిగూడినయో!ఏ గడీల ఎట్టి బతుకుల మీద ఎదురు దిర్గినయో అదంత తిర్లమర్లయింది.కొట్లాడి తెచ్చుకున్న అద్దుబందుల తెలంగాణల బతుకమ్మ పండుగ మళ్ళా దొర గడీల పండుగైంది.గడీల దొరబిడ్డ అడుకునేటి బతుకమ్మే ‘‘బతుకమ్మ’’గాబట్టె!గడీలు గాకవోతె మైదానంల ఆడబట్టిండ్లు.సుట్టూర పోలీసోళ్ళ కావలుంచి,పేపరోళ్ళు,టీ.వీ.లోళ్ళు ఛలో!ఇంగషురూ!అనంగనె మైకుల ఛానల్‌ ‌బతుకమ్మ పాటినవడుతది.కల్వంకుంట్లోళ్ళ ఇంటాడిబిడ్డ మందిల కల్వంగనె,కార్లల్లదిగి నడిషచ్చిన నగల దుకాండ్లాసొంటి దొరసానుల బతుకమ్మాట ఆడుడైతది.పసుపురైతులు ‘సాగనంపినంక’ నవ్వులు మరిశిన తెలంగాణ బతుకవ్వ కోట్లుబెట్టి కొనుక్కున్న కొత్త కొలువచ్చిన సంబురంతో నుండె!ఈ మల్క ‘‘బాపు’’ సుత కుషామతుగున్నడు.కొత్త కొలువుతోని బతుకమ్మ కండ్లల్ల ఎలుగు కాన్రాబట్టె!
బతుకమ్మంటె సమ్మక్క తీర్గనే నమ్మకాలు,ఇశ్వాసాలమీదికేలి పండుగలయినయంటరు.

పేరు మోశినోళ్ళు,గాళ్ళ వంశాలు కాపాయం జేషినోళ్ళు గిట్ల యెవలన్న జీవిడిషినప్పుడు గాళ్ళ పేరుమీద పండుగ జేషే ఆచారం మన తెలంగాణలనే కానత్తది.తీరొక్క పాటలు యాదివెట్టుకోని పాడుకోనేటి ఆట బతుకమ్మ. పల్లె,పట్నమనక తెలంగాణ ఆడబడుసుల కొంగు బంగారవైంది పాటలల్ల కానచ్చే సాహిత్యంకంటె పాటకు మనుసుల స్పందించే గుణమే బతుకమ్మ పాటయి, లయబద్దంగ ఇనచ్చే నడుక మనల్ని గమ్మునూకోనియ్యదాయె అటిటు తలకాయలూపిత్తది. కాలాడిపిత్తది.మనుసును పాటెనుక గుంజుకపోతది.పాటెనుక పాట మనల్ని కట్టేశినట్లయితది.గిసొంటి పాటల పండుగను ఎవలు గిట్ల బేయిజ్జత్‌ ‌జేయబట్టిండ్లు!?

ఒక్కొక్క వువ్వేసి….         చంద మామా!
ఒక్క జాము ఆయె….      చంద మామా!
రెండేసి పువ్వు తీసి….     చంద మామా!
రెండు జాము లాయె ….  చంద మామా!

సప్పట్ల మోతలల్ల ఓ అవ్వ బాడుతాంటె మిగిలినోళ్ళు మళ్ళ బాడుకుంట బతుకమ్మల సుట్టు అడుగు దీషి అడుగేసుకుంట ఆడేటి ఆడోళ్ళ బతుకమ్మ  సంబురాలేడ బోయినయి.!? టీ.వీ.చానెల్లు.ముక్కు మొగం తెల్వని చానెల్‌ ‌దందోళ్ళు సుత బతుకమ్మపాటలు బయటి కిడ్వబట్టె! బతుకమ్మలాడే తాన మొత్తం’’గులాల్‌’’ ‌జల్లుడేనాయె,గాళ్ళు మైకులల్ల గీ చానెల్‌ ‌బతుకమ్మ పాటలు పెట్టెటాలకు గా పాటలకే ఎగురి,దునికి బతుకమ్మ పండుగ ఒడగొడ్తాండ్లు.ఎన్కటి పాటలను లేకుంట జేషే కుట్రబాజి కతలు వడేటి, ఛానెల్‌ ‘‘‌దాల్చా’’పాటలు బతుకమ్మ పండుగ రూపురేకలనే మార్వబట్టినయి.
తెలంగాణచ్చినంక యేడ మీటింగులైనా! యే లీడర్‌ ‌వూళ్ళెకచ్చినా,పుసుక్కున యెవలన్న ఎలచ్చన్ల గెలిషినా గాళ్ళను యెదుర్కోని బోయేతాన  సుట్టుపక్కల ఆడోళ్ళు బోనాలెత్తుడు,బతుకమ్మలు బట్టే కతలు మోపయినయి. కాలంగాని కాలంల గిసోంటి బోనాలేంది?బతుకమ్మ లేంది? గిదేమన్న రాజుల కాలమా!గాళ్ళేమన్న రాజులా! దొరల బలుపుకు పలుపుతాడు గట్టిన శాందారు చైతన్యమే మనబతుకమ్మ పండుగ.గసొంటియి మరిసి మళ్ళ దొరల కాళ్ళకాడ బాంచననుడేడిది!?బోనాలు,బతుకమ్మ పండుగల ఇజ్జత్‌ ‌లేకుంట జేషే బేకార్‌ ‌గాండ్లకు ఎవలు జెప్పాలె!.అధికారికంగ బతుకమ్మ జేసుడు పేరుతోని బతుకమ్మాటకు సర్కార్‌ ‌కోట్ల రూపాలిచ్చినంటది.అయి యెవలి పాలయితయో యెవలికెరుక గాదు.మైకులల్ల బతుకమ్మ పాటలేసుకోని,దొరసాన్లు సినిమా డాన్సులు జేషేందుకు టాంకు బండు అటిటు బందు వెట్టి పోలీసోళ్ళ కావలిబెట్టి గీ తమాషా జూపెడుతరు. బతుకమ్మ పండుగ పేరుమీద ఎండి,బంగారు జరీ చీరలని నేయించినవంటరు.పండుగ పూట రోడ్లపొంటి యాబయిరూపాలకు దొరికే చీరలు పంచుడాసొంటియి రాజకీయాలల్ల పగటేషాలే గని బతుకమ్మ లైతాయా!?
ఊళ్ళె బొడ్రాయి తాన,గుడి ముందట,బడి మైదానంల,సద్దుల దినాన ఉరిశెరువుల తాన మోగేటి సప్పట్ల బతుకమ్మ మనది. మన బతుకమ్మ లేడుంటయో యెరికె గదా! టీవీ లల్ల కాన్రావు గని,మన అవ్వలు,అక్క జెల్లెలు సంబురంగ ఆడిపాడేటి బహుజనుల బతుకమ్మలు షెరువు గట్ల
కాడ కానత్తానయి.బతుకమ్మ మన చెరువు పండుగ,మన నీళ్ళ పండుగ, మన షేన్ల పొంటి పెరిగి మనల పల్కరిచ్చేటి తంగెడి పూల,గునుగు,గోరంట పూల పండుగ. గోడ పొంటి పారేటి గుమ్మడి,కాకర,బీర,కట్ల తీగలకు బూషిన తీరొక్క రంగుల పూల పండుగ!

‘జూడ్రా!బయ్‌!ఇ‌క్రమార్క్’’!

‘‘ఇప్పటిదాంక యింటివి గదా! తెలంగాణ అచ్చినంక మన బతుకమ్మ పండుగను అధికారికంగ జేయబట్టినంక నీ లొల్లేందిర బయ్‌!? ‌గిట్ల జేసుడెనుక యేమన్న మతలబున్నదా!? యేంది కతా!? కారణం జెప్పకుంట మెసిలినవనుకో మూసీ వరదల దునుకుత’’ అని యెప్పటి తీర్గనే బెదిరిచ్చేటి బేతాళుని శవాన్ని బుజాన్నేసుకొని ‘‘ఇను బేతాళ్‌! ‌తెలంగాణ యెవలికచ్చిందనేది యెరికె గద! దొరల రాజ్జెం మళ్ళ పానం బట్టింది, తెలంగాణ కు అడ్డం బడ్డోళ్ళే మంత్రులెమ్మేలేలయిండ్లు.గాళ్ళ దొరీర్కం నిలువాల్నంటె బాంచె బతుకులుండాలె! అందుకె సదువులియ్యకుంట గొర్లు,బర్లు యియ్య బట్టె! ఓట్లేషేది మనం,రాజ్జెమేలేది దొరలు,మన బతుకులనే గాదు,మన పండుగలు ఆచారాలు,మన బాస,మన యేషం అన్ని గుంజుకునే కతలు పడుడే గిట్ల బతుకమ్మనుఅదికారికంగ జేత్తానమనుడు.ముందుగాల బూములను,అటెంక గీ బూములను నమ్ముకున్న మన బతుకులను,మన బతుకమ్మలు దోసుకునెటందుకే గీ కతలు బడుతాండ్లు’’ అని జెప్పుకుంట నడ్వ బట్టిండు…నడ్వ బట్టిండు…
 – ఎలమంద.తెలంగాణ

Leave a Reply