Take a fresh look at your lifestyle.

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో…

బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తెలంగాన ప్రాంతాన ఉయ్యాలో..
తెల్లవారంగానే ఉయ్యాలో..
పేర్చితిమి బతుకమ్మ ఉయ్యాలో..
ప్రేమ పూర్వకంగా ఉయ్యాలో..
కుల మతాలు మరచి ఉయ్యాలో..
చిన్న పెద్ద కలిసి ఉయ్యాలో..
ముద్దులా బతుకమ్మ ఉయ్యాలో..
మంచిగా పేర్చు తూ ఉయ్యాలో..
కట్ల పూలు తెచ్చి ఉయ్యాలో..
కాంతను కొలిచి ఉయ్యాలో..
గోరింటాను తెచ్చి ఉయ్యాలో..
గౌరిని సేవించి ఉయ్యాలో..
రుద్రాక్ష పూలు తెచ్చి ఉయ్యాలో.
రుద్రానిని చేసి ఉయ్యాలో..
పసుపు కుంకుమల తో ఉయ్యాలో..

పార్వతిని ప్రార్ధించి ఉయ్యాలో..
తంగెడు పూలతో ఉయ్యాలో..
తల్లిని తలచి ఉయ్యాలో..
శంకు పూలతో ఉయ్యాలో..
శంకరుని పూజించి ఉయ్యాలో ..
నాంది వర్ధనాల తో ఉయ్యాలో..
నాతిని పిలిచి ఉయ్యాలో..
వెదురు కర్రలతో ఉయ్యాలో..
తట్టను అల్లుతూ ఉయ్యాలో..
సిక్కుడు తీగలతొ ఉయ్యాలో..
సిబ్బిని పేర్చితి ఉయ్యాలో..
బంతి పూలతో ఉయ్యాలో..
బంధాలను నిలపాలని ఉయ్యాలో..
ఆడి పాడితిమి ఉయ్యాలో ..
ఆనందంగా గడిపితిమి ఉయ్యాలో…
అమ్మ లక్కలందరు ఉయ్యాలో..
ఒక్క దగ్గర చేరి ఉయ్యాలో..
ఓపికగా పాడి..పది రోజుల పాటు ఉయ్యాలో..
వాయనములు ఇచ్చుతూ ఉయ్యాలో..
ఒక్కటవుధామని ఉయ్యాలో..
పోయి రావమ్మ ఉయ్యాలో..
మళ్లీ రావమ్మ ఉయ్యాలో..

(అక్టోబర్‌ 6 ‌నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం సంధర్బముగా) – కామిడి సతీష్‌ ‌రెడ్డి, జడలపేట జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా ..9848445134

Leave a Reply