Take a fresh look at your lifestyle.

బత్తాయి రైతులను ఆదుకోవాలి

లాక్‌ ‌డౌన్‌తో మార్కెట్‌ ‌లేక నిమ్మ, బత్తాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు
: టీజేఎస్‌ అధ్యక్షుడు,  ప్రొ।। కోదండరామ్‌

గురువారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో బత్తాయి మరియు నిమ్మ తోటలను సందర్శించిన తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరామ్‌ ‌మరియు జిల్లా నాయకులు

‌రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి అత్యధికంగా సాగు అవుతుందని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరాం తెలిపారు. కరోనా లాక్‌ ‌డౌన్‌తో మార్కెట్‌ ‌లేక నిమ్మ, బత్తాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బత్తాయి గిరాకీ అంత ఎగుమతి ద ఆధారపడి ఉంటుందని కోదండరాం తెలిపారు. టన్ను బత్తాయికి 5 వేల రూపాయలు కూడా రేటు లేదన్నారు. ప్రభుత్వం నిమ్మ, బత్తాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోదండరాం డిమాండ్‌ ‌చేశారు. 203 జీవో అమలైతే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టులు ఖాళీ కావడం ఖాయమన్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలమధ్య నీటి వినియోగం న్యాయ సమ్మతంగా జరగాలన్నారు. కృష్ణ రివర్‌ ‌బోర్డు ద్వారా తెలంగాణ హక్కుల పరిరక్షణకు ప్రయత్నం చెయ్యాలన్నారు. ఎఫెక్స్ ‌బోర్డు కైనా వెల్ళైనా తెలంగాణ హక్కులను కాపాడాలని కోదండరాం పేర్కొన్నారు.

Leave a Reply