Take a fresh look at your lifestyle.

కర్నాటక సిఎంగా బసవరాజ బొమ్మై ప్రమాణం

కార్యక్రమానికి హాజరైన యెడ్యూరప్ప, కేంద్ర మంతి కిషన్‌ ‌రెడ్డి
బెంగళూరు, జూలై 28 : కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు బొమ్మైతో గవర్నర్‌ ‌థాపర్‌ ‌చంద్‌ ‌గెహ్లాట్‌ ‌ప్రమాణం చేయించారు. కన్నడలో ఆమన ప్రమాణం చేశారు. యడ్యూరప్ప రాజీనామ చేశాక బొమ్మైని ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన బిజెపి పార్టీ నేతగా ఎంపికయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్‌ ‌రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌, ‌మాజీ సిఎం యెడ్యూరప్ప తదితరులు హాజరయ్యారు.

అంతకు ముందు ఆయన బీజేపీ కేంద్ర పరిశీలకుడు ధర్మేంద్ర ప్రధాన్‌, ‌మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ ‌యడియూరప్పతో భేటీ అయ్యారు. యెడ్యూరప్ప కేబినెట్‌లో •మ్‌ ‌మినిస్టర్‌గా బొమ్మై పని చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతున్నది. రాష్ట్రానికి ఈ నెల 11న కొత్త గవర్నర్‌ ‌వొచ్చారు. తావర్‌చంద్‌ ‌గెహ్లట్‌ ‌గవర్నర్‌గా వొచ్చిన పక్షం రోజుల్లోనే నూతన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ సిఎం సిద్ధరామయ్య శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply