- బాసర ట్రిపుల్ ఐటి సమస్యలను పట్టించుకోరా
- సిఎం కెసిఆర్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- నేడు యాదగిరి గుట్ట నుంచి బండి మూడవ విడత సంగ్రామ యాత్ర
- చేరికల జాబితాతో దిల్లీకి ఈటల, డికె అరుణ
కరీంనగర్, ప్రజాతంత్ర, అగస్టు 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక్కడ వరదల్లో ప్రజలు మునిగితే అక్కడ ఆయన ఏ ఘనకార్యం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ…ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు సీఎంకు కనపడవా? అని నిలదీశారు. బాసరలో కావాలనే ఫుడ్ పాయిజన్ చేసినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం ఆ ఫుడ్ తింటుందా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ కాలేజీల్లో టీఆర్ఎస్ నేతలకు పార్ట్నర్ షిప్ ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి ఎక్కువ అయ్యిందని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర..పార్టీలోకి చేరికలతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పటికే జిల్లాల వారీగా బీజేపీలో చేరు వారి జాబితాను చేరికల కమిటీ సిద్ధం చేసింది.
ఇందులో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీలో చేరేవారి లిస్ట్‌ను పార్టీ హైకమాండ్‌కు చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, పార్టీ ముఖ్యనేత డీకే అరుణ అందజేయనున్నారు. ఈ మేరకు ఇద్దరు నేతలు దిల్లీ వెళ్లారు. పార్టీ జాతీయ నేతల అనుమతి రాగానే ఆపరేషన్ ఆకర్ష్‌ను భారీ స్థాయిలో తెరతీయనున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. మంగళవారం నుంచి నిర్వహించే పాదయాత్ర సందర్భంగా నేడు మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకోనున్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2న యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమై 26వ తేదీన హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ముగియనుంది. 24 రోజుల పాటు 125 గ్రామాల వి•దుగా 325 కిలోవి•టర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకూర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.