Take a fresh look at your lifestyle.

బార్లు, క్లబ్బులకు అనుమతి..!

  • ప్రభుత్వం ఉత్తర్వులు
  • మ్యూజికల్‌ ఈవెంట్స్, ‌డ్యాన్స్‌లకు నిషేధం
  • కొరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి

హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌25:. కొరోనా లాక్‌డౌన్‌ ‌కారణంగా బార్లు, కబ్బులను మూసివేయాలని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇప్పటికే వైన్‌ ‌షాపులు తెరుచుకోగా, మొత్తానికి దాదాపు ఆరు నెలల కాలం తర్వాత తెలంగాణలో బార్లు, క్లబ్బులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్‌ ‌రూమ్‌లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బార్లు, క్లబ్బులలో మ్యూజికల్‌ ఈవెంట్స్, ‌డ్యాన్స్‌లను నిషేధించారు. కొరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు పాటించని బార్లు, క్లబ్బులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

బార్లలో క్రమపద్ధతి పాటించాలి, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు విధించింది. ఇకపోతే పార్కింగ్‌ ఏరియాల్లో జనాలు గుమిగూడ కుండా చూడడమే గాకుండా,  శానిటైజర్‌ ‌తప్పనిసరిగా ఉంచాలి.  బార్లు, క్లబ్బుల సిబ్బందితో పాటు మిగతా వారు కచ్చితంగా మాస్కు ధరించాలి.  మ్యూజికల్‌ ఈవెంట్స్, ‌డ్యాన్స్‌లపై నిషేధం.  ప్రతి రోజు ఉదయం, సాయంత్రంతో పాటు ఒక వ్యక్తి మద్యం సేవించి వెళ్లిన తర్వాత ఆ సీటును శానిటైజ్‌ ‌చేయాల్సి ఉంటుంది. బార్లలో గాలివెలుతురు వచ్చేలా వెంటిలేషన్‌ ఉం‌డేలా చర్యలు తీసుకోవాలి. కస్టమర్లు వచ్చేముందు ప్రతి బార్‌లోపల, బయటా ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ ‌చేయాల్సి వుంటుంది. బార్‌లలో సరైన వెంటిలేషన్‌ ఉం‌డేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాగా వైన్‌షాపుల వద్ద నిర్వహించే పర్మిట్‌ ‌రూమ్‌లకు తదుపరి ఆనుమతి ఇచ్చే వరకూ మూసే ఉంచాలని ప్రభుత్వం వెల్లడించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply