Take a fresh look at your lifestyle.

యథావిధిగా బ్యాంకుల పనివేళలు 10 నుంచి అమల్లోకి..

రాష్ట్రంలో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా మొదలయ్యాయి. గతంలో మాదిరిగా ఉదయం 10 నుంచి 4 గంటల వరకు సమయపాలన కొనసాగుతుందని ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం లాక్‌డౌన్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే. మేలో లాక్‌డౌన్‌ అమలు చేసిన నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి.

లాక్‌డౌన్‌ ‌ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 10 వరకు, జూన్‌ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి. ఈ నెల 10 నుంచి లాక్‌డౌన్‌ ‌నుంచి సడలింపులు ఇవ్వడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్‌ ‌కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. బ్యాకింగ్‌ ‌సమయ వేళలను ఖాతాదారులు గమనించాలని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది.

Leave a Reply