వికారాబాద్ : బ్యాంకులు, పోస్టాఫీసులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డబ్బులను చెల్లించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని పోస్టుఆఫీస్, ఎస్బిఐ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకు లను పెట్రోల్ బంకులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, పోస్టుఆఫీస్ ముందు ప్రభుత్వం ఇస్తున్న పదిహేను వందల కోసం గుంపులుగా నిలుచున్న ప్రజలకు అవగాహన కల్పించి వారిని ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా వరుసలో నిలబెట్టాలని తెలిపారు. బ్యాంక్ పరిసరాలలో వాలంటీర్లను ఏర్పాటు చేయాలి కోరారు. పోస్టాఫీస్‌లో ప్రస్తుతం ఉన్న 2 కౌంటర్లను 4 కి పెంచాలని అన్నారు.
బ్యాంకులలో, పోస్టుఆఫీస్లలో ప్రజలకు టోకెన్లు ఇవ్వాలని అన్నారు. ప్రజలు లైన్లలో ఎక్కువ సేపు నిలబడుతున్నారు కావున వారికి టోకెన్లు ఇవ్వడంతో పాటు కూర్చోడానికి చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కసారి అకౌంట్ లోకి వచ్చిన డబ్బులు ఖాతాదారు అనుమతి లేకుండా ఎక్కడికి పోవని, అవసరం ఉంటేనే బ్యాంక్ నుండి డబ్బులు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, చిగుల్లపల్లి రమేష్ కౌన్సిలర్లు సురేష్, లంకా లక్ష్మీకాంత్ రెడ్డి, వేణుగోపాల్ ఉన్నారు.