Take a fresh look at your lifestyle.

‌గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి

బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్‌ ‌వెంకట్రావు

మహబూబ్‌గర్‌, ఏ‌ప్రిల్‌ 28 (‌ప్రజాతంత్ర ప్రతినిధి) : కరోనా వైరస్‌ ‌ను దృష్టిలో ఉంచుకొని మహిళా స్వయం సహాయక బృందాలకు కోవిడ్‌-19 అత్యవసర తత్కాల్‌ ‌రుణ సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌వెంకట రావు బ్యాంకు మేనేజర్లను ఆదేశించారు మంగళవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో బ్యాంకుల మేనేజర్లు,వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ కోవిడ్‌ ‌కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నందున, గ్రామీ ణ ప్రాంతాలలో నివసించే స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఇబ్బంది పడకుండా నేరుగా బ్యాంకుల ద్వారా ప్రతి సంఘానికి ఒక లక్ష రూపాయలు లేదా ప్రతి సభ్యురాలికి 5000 రూపాయలు తగ్గకుండా ఇది తక్కువైతే అది తిరిగి చెల్లించే విధంగా రుణాలను మంజూరు చేయాలని సూచించారు. ఇప్పటివరకు బ్యాంకులవైపు కన్నెత్తి చూడని, వ్యసాయ రుణాలు పొందని కొత్త రైతులను వ్యవసాయ శాఖ అధికారులు సహకారంతో గుర్తించి ముందుగా వారికి ఋణాలి వ్వాలని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు రుణాలు,బ్యాంకులకు సంబంధించి కంట్రోల్‌ ‌రూమ్‌ ‌కు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాల న్నారు. సమాజంలో ఉన్న హిజ్రా లను గుర్తించి ఋణాలివ్వాల న్నారు.

అన్ని బ్యాంకుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని బ్యాంకు మేనేజర్‌ ‌లతో కోరారు. కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ ‌కార్డుదారులకు మంజూరు చేసిన పదిహేను వందల రూపాయలు తీసుకునే నిమిత్తం, అంతేకాక వ్యవసాయ రుణాల నిమిత్తం లబ్ధిదారులు, రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకులకు వస్తారని, అందువల్ల కరోనా వైరస్‌ ‌దృష్ట్యా బ్యాంక్‌ ‌మేనేజర్లు అన్ని బ్యాంకుల ముందు ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు తప్పనిసరి గా మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలని, చేతులు శుభ్రంగా కడుక్కునెందుకు సబ్బు,నీరు, శానిటైజర్‌లను అన్ని బ్యాంకుల వద్ద ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా ప్రతి బ్యాంకు ముందు టెంట్‌ ‌తో పాటు, తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశిం చారు. అదనపు కలెక్టర్‌ ‌మోహన్లాల్‌,ఎల్‌ ‌డి ఎం నాగరాజు, వ్యవసాయ శాఖ అధికారిని సుచరిత, డిఆర్డిఓ వెంకటరెడ్డి ,బ్యాంక్‌ ‌మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!