Take a fresh look at your lifestyle.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు సిబ్బంది సమ్మె

  • దేశవ్యాప్తంగా స్తంభించిన బ్యాంకింగ్‌ ‌కార్యకలాపాలు
  • సమ్మెలో పాల్గొన్న 10 లక్షల మంది ఉద్యోగులు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : ‌కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా దేశవ్యాప్తంగా బ్యాంకు సిబ్బంది సోమవారం సమ్మెలో పాల్గొన్నారు. రెండు రోజుల సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ ‌కార్యకలాపాలు స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాలతో కూడిన యునైటెడ్‌ ‌ఫోరమ్‌ ఆఫ్‌ ‌బ్యాంకింగ్‌ ‌యూనియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకులను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదనీ, ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు నష్టాల బాట పడుతున్నాయనే సాకుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయదమో లేక ప్రైవేటు రంగానికి అప్పగించడమో చేస్తున్నదని విమర్శించారు. ప్రభత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదా కార్పొరేట్‌ ‌సంస్థలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ వాటాల విలువ జీరోకు చేరుతుందని తద్వారా సామాన్యునికి సంబంధించిన బ్యాంకింగ్‌ ‌కార్యకలాపాలపై అదనపు భారం పడుతుందని విమర్శించారు.

కాగా, కేంద్ర ఆర్థిక శాక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ‌గత నెలలో పార్లమెంటులో బడ్జెట్‌ ‌సమర్పించిన సందర్భంగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై అడిషనల్‌ ‌చీఫ్‌ ‌లేబర్‌ ‌కమిషనర్‌ ‌సమక్షంలో ఈ నెల బ్యాంకు యూనియన్ల ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు రెండు రోజుల సమ్మెలో పాల్గొంటున్నారు.

Leave a Reply