Take a fresh look at your lifestyle.

భయం గుప్పిట్లో బంగ్లా హిందువులు..!

హిందువులు పవిత్రంగా పూజలు చేసుకోవడం నేరం అయిపోతుంది.!  మండపాలలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు భయానక కాల రాత్రులుగా మారాయి.  అందంగా అలంకరించిన దుర్గామాత మండపాలను కాల్చివేసి, హిందువుల ఇళ్లను కూల్చివేసి,   వస్తువులను దహనం చేస్తున్నాయి ఇస్లాం తీవ్రవాద శక్తులు.  పసిపిల్లలు, మహిళల పై అత్యాచారాలు.. హత్యలు అమానవీయంగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మానవ హక్కుల సంఘాలు మౌనం దాలుస్తున్నాయి. హిందూ మైనారిటీల హక్కులు, అవస్థలు ఎవరికీ పట్టడం లేదు. హిందువుల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రపంచం మౌన పాత్ర పోషించడం మానవత్వానికి మచ్చ!

బంగ్లాదేశ్‌ ‌లోని 22 జిల్లాలలో వందలాది ఇళ్లను నేలమట్టం చేశారు. 60 ఇళ్లను దహనం చేశారు. 18 గోదాములు, అరవై గడ్డివాములు, అనేక పశువులూ మంటల్లో కాలి బూడిదయ్యాయి. (ఇది అక్కడి ప్రభుత్వ లెక్కలు మాత్రమే.కానీ.. వాస్తవంగా దీనికి మించిన సంఖ్యలో నష్టం వాటిల్లింది) అప్పటికే కొన్ని రోజుల ముందు నుంచి  పథకం ప్రకారం హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, ఆస్తులకు నష్టం చేయడం, దాడులకు తెగబడి భయబ్రాంతులకు గురి చేసిన విషయం ప్రపంచానికి తెలిసిందే. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర హిందువులను అంతం చేస్తూనే  ఉన్నారు. అత్యాచారాలకు లెక్కేలేదు. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ  బంగ్లాదేశ్‌ ‌పర్యటన సందర్భంగా అక్కడి హిందువుల పై దాడి జరిగింది. దేవాలయాలను ధ్వంసం చేశారు. పదుల సంఖ్యలో హిందువులను హత్య చేశారు.

ఖురాన్‌ ‌కు అవమానం జరుగుతున్నట్లు చిత్రీకరించే నిర్ధారణ కానీ ఫోటోలు, వీడియోల ఆధారంగా అల్లర్లకు దిగటం అరాచకం.! నిత్యం ఇలా దాడులకు పాల్పడడం ముస్లిం ఛాందసవాదులకు అలవాటుగా మారింది. హిందువుల వ్యాపారాలు దెబ్బతినేలా వ్యవహరించి, దుకాణాలను లూటీ చేయడం, తగలబెట్టడం పరిపాటిగా మారింది.

ఈ ఘోర పరిణామాలు చూస్తుంటే ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్‌ అభిప్రాయం ప్రకారం ‘‘అది బంగ్లాదేశ్‌ ‌కాదు.. జిహాదిస్తన్‌.  ‌మదర్సాలలో పిల్లలకు మత విద్వేషం నూరిపోస్తున్నారు. బంగ్లాదేశ్‌ ‌లో హిందువులను, బౌద్ధుల ను కనీసం మనుషుల్లాగా చూడటం లేదు.. ద్వితీయ శ్రేణి లో కాదుకదా తృతీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు.  గత ప్రధానమంత్రులుగానే ప్రస్తుత ప్రధానమంత్రి షేక్‌ ‌హసీనా ప్రభుత్వం కూడా రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని వాడుకుంటున్నారు.’’ అనే ఆమె మాటలు అక్షరాలా సత్యం.

ముస్లిం ఛాందసవాదులు విడతలు విడతలుగా చేసిన దాడుల్లో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. బంగ్లాదేశ్‌ ‌లోని బేగం గంజ్‌ అనే ఒక పట్టణంలో గత శుక్రవారం ప్రార్థనలు ముగించుకొని వచ్చిన అల్లరిమూకలు మండపం లోకి చొరబడి దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత ఆలయ కమిటీ సభ్యుడిని కత్తులతో పొడిచి  క్రూరంగా హత్య చేశారు. అంతటితో ఆగక మరికొంత మంది భక్తులను చంపేసి పక్కనే ఉన్నా చెరువులో పడవేశారు. ఈ విషయాన్ని అక్కడి దర్యాప్తు సంస్థల అధికారులు కూడా ధృవీకరించారు. బంగ్లాదేశ్‌  ‌ప్రభుత్వం, రక్షణ సిబ్బంది  మారణహోమాన్ని  ఆపాల్సింది పోయి చోద్యం చూస్తూ ఉండి పోయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా మనమందరం ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తూనే ఉన్నాం.

Bangla Hindus in fear guppit
  హిందువుల పై దాడులు హేయం: అమెరికా కమిషన్‌
‌బంగ్లాదేశ్‌ ‌హిందువులపై ఇటీవల జరిగిన భయానక దాడులు తీవ్రంగా కలవర పెడుతున్నాయి అని అంతర్జాతీయ మత స్వేచ్ఛ పై ఏర్పాటుచేసిన అమెరికా కమిషన్‌ ‌యు ఎస్‌ ‌బి ఐ ఆర్‌ ఎఫ్‌ ‌పేర్కొంది. హిందుత్వ వ్యతిరేక తీవ్రవాద శక్తులు చెలరేగిపోయి దాడులకు పాల్పడుతున్న కూడా ప్రభుత్వం కట్టడి చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మానవత్వానికి మచ్చలు తీసుకువచ్చే ఇలాంటి దురాగతాన్ని ఖండిస్తూ.. హిందువులే లక్ష్యంగా దాడులకు దిగిన తీవ్రవాద శక్తులను అణచి వేసేందుకు చర్యలు తీసుకోవాలని బంగ్లా ప్రధాని షేక్‌ ‌హసీనాకు  యు ఎస్‌ ‌సి ఐ ఆర్‌ ఎఫ్‌ ‌ప్రతినిధి నదిని మేంజ విజ్ఞప్తి చేశారు.

అయితే వాస్తవానికి  1947 లో  భారతదేశం మత ప్రాతిపదికన రెండుగా విడిపోయినప్పటి నుంచి  ఇటు పాకిస్తాన్‌, ఇటు బంగ్లాదేశ్‌ ‌లో ఉన్న హిందువుల పరిస్థితి దయనీయం గానే ఉంది. అన్యాయంగా, అకారణంగా  వారి  జీవన హక్కులను అల్లరిమూకలు కాల రాస్తున్నాయి. నేటికీ వారి  జీవనం ఆ ప్రాంతాలలో  దుర్భర స్థితిలో ఉంది అనేది  జగమెరిగిన సత్యం. 1947 నుంచి 1950 వరకు  బంగ్లాదేశ్‌ ‌ప్రాంతంలో ప్రామాణిక గణాంకాల ప్రకారం రెండు మిలియన్ల హిందువులు అమానుషంగా హత్యకు గురయ్యారు. అదేవిధంగా ఐదు మిలియన్ల హిందూ శరణార్థులు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భారతదేశంలో తలదాచుకున్నారు. 1964 మరియు 1971లో సైతం బంగ్లాదేశ్‌ ‌ప్రాంతంలో అల్ప సంఖ్యాకులైన హిందూలపై మారణహోమం కొనసాగింది. 1971 యుద్ధ సమయంలో 2 నుంచి 3 మిలియన్ల హిందూ మహిళలు, పసిపిల్లలు చంపబడ్డారు.  దాదాపు నాలుగు లక్షల మంది హిందూ మహిళలను బంధించారు. తర్వాత పాకిస్థాన్‌ ‌సైనికుల  అఘాయిత్యాలకు, అత్యాచారాలకు గురై ప్రాణాలను కోల్పోయారు. దురదృష్టం ఏమిటంటే బంగ్లాదేశ్‌ ‌స్వాతంత్రం పొందిన తర్వాత  కూడా  1971 నుండి అక్కడున్న అల్ప సంఖ్యాకులైన హిందూలపై దాడులు, మారణహోమం  భయానక పరిస్థితులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

1947లో భారతదేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ ‌మరియు తూర్పు పాకిస్తాన్‌( ‌నేటి బంగ్లాదేశ్‌) ‌లో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులైన హిందూలు  నేడు అల్ప సంఖ్యాకులుగా జీవచ్ఛవాలుగా చస్తూ బతుకుతున్నారు.  వారి మానవ హక్కులు కాలరాస్తూ అక్కడి ఉగ్రఇస్లాంమూకల చేతిలో నరకం అనుభవిస్తున్నారు. ఇది ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహస్యం. ముస్లిం చాందస తీవ్రవాద సంస్థల దాడులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ ‌మరియు బంగ్లాదేశ్‌ ‌లలో 8 శాతంగా ఉన్న హిందువుల మనుగడ ప్రశ్నార్థకమే!  2050 నాటికి ఈ 8 శాతం కూడా సున్నాకి చేరిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇది పూర్తిగా యూదుల  ఊచకోతను తలపిస్తోంది: VHP
‘‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ‌లో జరుగుతున్న మారణహోమం హృదయవిదారకమైనది’’ అని విశ్వహిందూ పరిషత్‌ ఆం‌దోళన వ్యక్తం చేసింది. ఈ అమానవీయమైన  మారణహోమాన్ని దృష్టి లో ఉంచుకొని, అల్ప సంఖ్యాకులైన హిందూలపై  జరుగుతున్న దాడులను నిలువరించాలని  డిమాండ్‌ ‌చేస్తోంది. బంగ్లా దాడుల ఘటనలో అంతర్జాతీయ స్థాయిలో పరిశీలనాకమిటీ,  నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఇస్లాం ఉగ్రమూకల చర్యలను అంతర్జాతీయంగా విచారణ చేపడుతూ, బంగ్లాదేశ్‌ ‌హిందువులపై జరుగుతున్న  ఉగ్ర దాడులను క్షేత్రస్థాయిలో సమగ్రమైన  విచారణ చేపట్టి  మానవ హక్కులను కాపాడవలసిందిగా ఐక్యరాజ్యసమితి  మానవ హక్కుల కమిషన్‌ ‌ను కోరింది.
అక్కడి హిందువులు ప్రశాంతంగా జీవించేటటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని  అంతర్జాతీయ మానవ హక్కుల అధికారులను విజ్ఞప్తి చేసింది. హిందువులే లక్ష్యంగా సాగుతున్న ఉగ్ర వాద చర్యలను అంతమొందించాలని పేర్కొంది. హిందువుల ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న ఉగ్ర వాదులను గుర్తించి చట్టం ప్రకారం శిక్షించి, బంగ్లాదేశ్‌ ‌లో నివసిస్తున్న  హిందూ  జీవన హక్కులను కాపాడాలని  కోరుతోంది. హిందువుల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ప్రతి మానవతావాది కులాలు మతాలకు అతీతంగా ఖండించాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు తావు లేకుండా మత స్వేచ్ఛను గౌరవించాలి.

– పగుడాకుల బాలస్వామి,  ప్రచార సహ ప్రముక్‌
‌విశ్వహిందూ పరిషత్‌, 9912975753

Leave a Reply