Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం.. కొనసాగడం కష్టమే

  • ఎప్పుడు పడిపోతుందో తెలియదన్న బండి సంజయ్‌
  • ‌మంత్రి పువ్వాడ అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరిక

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌పాలన పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని..తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ…ఎప్పుడు ప్రభుత్వం పడి పోతుందో తెలియదన్నారు. వొచ్చే రెండేళ్లు కొనసాగడం కూడా కష్టమే నంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మరోవైపు.. మంత్రి పువ్వాడను టార్గెట్‌ ‌చేశారు. మంత్రి చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్న ఆయన.. ఖమ్మం కార్పొరేషన్‌లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు..బీజేపీని విమర్శిండానికి మంత్రికి సిగ్గుండాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. మంత్రికి ఒక్క రోడ్డు సాంక్షన్‌ ‌చేయించుకునే దమ్ముందా..? అంటూ ప్రశ్నించారు. నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారారు..ఈ మంత్రి మాకు నీతులు చెప్పుతారా..? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. నీ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసంటూ మంత్రి పువ్వాడ బండి సంజయ్‌ ‌ఫైర్‌ అయ్యారు. భూకబ్జాల కోసమే ఎర్రజెండా వొదిలి టీఆర్‌ఎస్‌లో చేరారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

మెడికల్‌ ‌కాలేజీ పేరుతో భూములు
దోచుకున్న సంగతి ప్రజలకు తెలుసునని చెప్పారు. మంత్రి అజయ్‌ ‌భూకబ్జాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో తాము అధికారం చేపడతామని..టీఆర్‌ఎస్‌ ‌నాయకుల ఆగడాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి అజయ్‌కు కొమ్ముకాసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్‌ ‌హెచ్చరించారు. అక్రమ భూములని రెగ్యులర్‌ ‌చేసుకోవడం కోసం టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారని ఆరోపించారు. మెడికల్‌ ‌కాలేజీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇక, దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పై కొరోనా వ్యాక్సిన్‌ ‌ప్రయోగించాం.. రెండు చోట్ల సక్సెస్‌ అయ్యిందన్నారు బండి. తర్వాత ఖమ్మం కార్పొరేషన్‌లో వ్యాక్సిన్‌ ‌ప్రయోగించ బోతున్నాం..దమ్ముంటే వ్యాక్సిన్‌ ‌నుంచి మంత్రి బయట పడే ప్రయత్నం చేయి అంటూ సవాల్‌ ‌చేశారు. మరోవైపు తెలంగాణలో మంత్రులందరూ డమ్మిలేనని ఎద్దేవా చేశారు.

Leave a Reply