Take a fresh look at your lifestyle.

ప్రజా సంగ్రామ యాత్ర – తెలంగాణలో బిజెపి అధికారానికి మలుపు

‘‘‌తెలంగాణ రాష్ట్రంలో కొరోనా కారణంగా పేద,మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొని నేటికి కూడా కోలుకొని వారి గురించి అలోచించకుండా రాష్ట్రంలో ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో ఫీజులు తగ్గించడం కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చెయ్యడం లేదో తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.’’

రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

తెలంగాణలో భార తీయ జనతా పార్టీ లక్ష్యం ఒక్కటే అదే అధికారంలోకి రావడం… 2014 వ సంవ త్సరంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న టువంటి అభివృద్ధి కారణంగా తెలంగాణ ప్రజలు బిజెపి వైపు ఉన్నారనేది దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలలో, జి. హెచ్‌. ఎమ్‌. ‌సి. ఎన్నికలలో మరియు ఆతదనంతరం జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. దుబ్బాక ఎన్నికలలో బిజెపి విజయం క్రమక్రమంగా టీ ఆర్‌ ఎస్‌ ‌పతనానికి నాంది కాగా, జి. హెచ్‌. ఎమ్‌. ‌సి. ఎన్నికల ఫలితాల ద్వారా ఇది వాస్తవమే అనిపించింది. టీ ఆర్‌ ఎస్‌ ‌లో ప్రముఖ పాత్ర పోషించిన ఈటల రాజేందర్‌ ‌బిజెపిలో చేరడం, హుజూరాబాద్‌ ‌లో బిజెపి గెలుపుతో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అని తెలిపోయింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చెయ్యాలన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ నిర్ణయించుకుంది. రాష్ట్రంలో నడుస్తున్న కుటుంబ పాలన అంతం, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేసి ఈ అసమర్థ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే ప్రధానంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించడం జరిగింది.ఇప్పటికే మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి కాగా గురువారం నుండి జోగులాంబ అమ్మవారి దీవెనలతో రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యాత్ర విజయవంతం కోసం దాదాపు 30 కమిటిలను నియమించి అన్ని విభాగాల మధ్య పూర్తి సమన్వయంతో ముందుకెళ్ళే విధంగా మార్గదర్శనం చేశారు.

ప్రధానంగా ఈ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌ ‌జిల్లాలలో అలంపూర్‌ ‌నుండి ప్రారంభం అయ్యి గద్వాల, మక్తల్‌, ‌నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌ ‌నగర్‌, ‌జడ్చర్ల, నాగర్‌ ‌కర్నూల్‌, ‌కల్వకుర్తి నియోజకవర్గాల మీదుగా వెళ్లి మహేశ్వరం వద్ద మే 14 వ తేదీన ముగుస్తుంది. భారతీయ జనతా పార్టీ కి మంచి పట్టున్న ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో వచ్చే అస్సెంబ్లీ ఎన్నికలలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోని తెలంగాణ రాష్ట్రంలో సునాయాసంగా అధికారంలోకి రావాలి భావిస్తున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌పాదయాత్ర చేయ్యడం చాలా వరకు కలిసి వచ్చే అంశం.

మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిన విధంగానే రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో కూడా రాష్ట్రంలో కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రజలలోకి తీసుకెళ్తాం.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని భావించి ఎందరో త్యాగాల ఫలితంగా చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అబివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యింది. ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు, నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రం సరిగ్గా మన వాటాను వినియోగించడం లేదు, నిధులతో ఈ రాష్ట్రాన్ని అబివృద్ధి చెయ్యకుండా ఒక్క కెసిఆర్‌ ‌కుటుంబమే ఈ తెలంగాణ సంపద మొత్తాన్ని దోచుకుంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా కారణంగా పేద,మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొని నేటికి కూడా కోలుకొని వారి గురించి అలోచించకుండా రాష్ట్రంలో ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో ఫీజులు తగ్గించడం కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చెయ్యడం లేదో తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. నర్సరీ, ఎల్‌. ‌కె. జి. నుండి ఉన్నత చదువుల వరకు పేద,మధ్య తరగతి కుటుంబాల వారికి అధిక ఫీజులు కట్టడం శక్తికి మించిన భారంగా మారుతుంది. అయినప్పటికి ఫీజు నియంత్రణ చట్టం గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించక పోవడం చాలా దారుణం.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాని గద్దె దించడం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర వేదిక కానుంది. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై నెలకొన్న ప్రజా వ్యతిరేకతను మరింతగా ప్రజలలోకి తీసుకెళ్ళి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అవినీతి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

Leave a Reply