Take a fresh look at your lifestyle.

బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌

‌టెంత్‌ ‌క్లాస్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో హనుమకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ ఆదేశం

కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌టెంత్‌ ‌క్లాస్‌ ‌హిందీ పేపర్‌ ‌లీకేజీ కేసులో ఏ1గా పోలీసులచే అరెస్టు కాబడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కి హన్మకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ 14 ‌జ్యుడిషియల్‌ ‌రిమాండ్‌ ‌విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సెలవు రోజు కావడంతో మేజిస్ట్రేట్‌ ఇం‌టివద్దే బండి సంజయ్‌ను విచారణ నిమిత్త పోలీసులు ప్రవేశ పెట్టగా ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి బండి సంజయ్‌కు ఈ నె 19 వరకు 14 రోజుల రిమాండ్‌ ‌విధించారు. కాగా పోలీసులు భారీ భద్రత మధ్య బండి సంజయ్‌ని కరీంనగర్‌ ‌సెంట్రల్‌ ‌జైలుకు తరలించారు.

Leave a Reply