Take a fresh look at your lifestyle.

త్వరలో కెసిఆర్‌ అవినీతి బట్టబయలు

ఆయన జైలుకు వెళ్లక తప్పదు
ఎన్నిక ఏదైనా ఇక గెలుపు బిజెపిదే
కెటిఆర్‌ను సిఎం చేసే ఆలోచన కెసిఆర్‌కు లేదు
జిహిహెచ్‌ఎం‌సి కార్పొరేటర్లతో బండి సంజయ్‌ ‌సమావేశం
కార్పోరేటర్లు ముట్టడికి ప్రయత్నించడంతో ప్రగతిభవన్‌ ‌వద్ద ఉద్రిక్తత

త్వరలోనే సిఎం కెసిఆర్‌ అవినీతిని బయటపెడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మరోసారి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అవినీతితో ఇక జైలుకు వెళ్లక తప్పదన్నారు. మరో మూడేళ్లు ముఖ్యమంత్రి కేసీఆరే అని… కేటీఆర్‌ను సిఎం చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని  కూడా బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ, గడీల, అవినీతి ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని…టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము ఉన్న ఏకైక పార్టీ బిజెపి అని స్పష్టం చేశారు. బేగంపేట భహరిత హోటల్‌లో మంగళవారం బిజెపి కార్పోరేటర్లతో సమావేశం అయ్యారు. బిజెపి కార్పోరేటర్లు జిహెచ్‌ఎం‌సిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బిజెపి వైపు నిలబడుతున్నారని…ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన దుబ్బాక, హైదరాబాద్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాల పర్వానికి కెసిఆర్‌ ‌చమరగీతం పాడకపోతే బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తుంటే..కవి•షన్ల పేరిట కోట్లకు కోట్లు వెనకేస్తూ.. ఎన్నికల్లో ఖర్చు పెట్టి వోట్లు కొనుగోలు చేయాలని కేసిఆర్‌ ‌చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొడుతున్నారని పేర్కొన్నారు.  కెసిఆర్‌ ‌కుటుంబం ఆరేళ్లుగా చేస్తున్న అవినీతి అక్రమాల చిట్టా త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని…ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. వరంగల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో సైతం డబ్బులతో వోట్లు కొనుగోలు చేయాలనే ప్రయత్నాన్ని మరోసారి ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.  సమావేశం ముగియగానే బండి వరంగల్‌ ‌పర్యటనకు బయలుదేరారు. అయితే బిజెపి కార్పోరేటర్లు  ప్రగతి భవన్‌ ‌ముట్టడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా వొచ్చి బీజేపీ కార్పొరేటర్లు సీఎం క్యాంప్‌ ‌కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఎన్నికలు జరిగి, గెలిచిన తర్వాత ఇంతవరకు కార్పొరేటర్లగా గుర్తిస్తూ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని, కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. తాము గెలిచినా తమ నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని, ఇంకా పాత కార్పొరేటర్లే అధికారం చెలాయిస్తున్నారని బీజేకీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు విలువ లేకుండా పోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం జీహెచ్‌ఎం‌సీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ప్రగతిభవన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బేగంపేటలోని హోటల్‌ ‌హరితలో సమావేశమైన బిజెపి కార్పొరేటర్లు ప్రగతి భవన్‌ ‌ముందు ధర్నా యోచన చేస్తున్నారని వార్తలు రావడంతో హోటల్‌ ‌హరిత ముందు, ప్రగతి భవన్‌ ‌ముందు భారీగా పోలీసుల మోహరించారు. బీజేపీ కార్పొరేటర్‌లు. పోలీసుల కళ్లుగప్పి ప్రగతి భవన్‌ ‌మెయిన్‌ ‌గేట్‌ ‌ముందుకు వొచ్చిన బీజేపీ కార్పొరేటర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ ‌చేసిన పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply