Take a fresh look at your lifestyle.

ఒక వర్గం వోట్ల కోసం కేసీఆర్‌ ‌మత రాజకీయాలు

మేయర్‌ ‌పీఠం అప్పగిస్తే వరద సాయం 25 వేలు అందిస్తాం
భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు..సీఎం వొస్తారని అనుకున్నానన్న 
  బండి  సంజయ్‌   

హైదరాబాద్‌ ‌మేయర్‌ ‌పీఠాన్ని బీజేపీకి ఇస్తే వరద బాధితులకు 25వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. చార్మినార్‌ ‌దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్న ఆయన… వి•డియాతో మాట్లాడుతూ.. పాతబస్తీని భాగ్యనగరంగా మార్చుతామని, గ్రేటర్‌లో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. కేసీఆర్‌ ‌సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.
వరద బాధితులకు సాయాన్ని నిలిపివేయించామని, తనపై చేసిన ఆరోపణలు బాధ కలిగించాయన్నారు. తన సంతకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఫోర్జరీ చేయించారని, బీజేపీపై తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఎంఐఎం సహకారంతో గెలవాలని కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వరద నష్టాన్ని అంచనా వేసి.. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. ఒక వర్గం వోట్ల కోసమే కేసీఆర్‌ ‌మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తన సవాల్‌ను స్వీకరించి భాగ్యలక్ష్మీ ఆలయానికి సీఎం వొస్తారని అనుకున్నానన్నారు. ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలనే భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వొచ్చానన్నారు.  తమ వొత్తిడి కారణంగానే వరద బాధితులకు ప్రభుత్వం పది వేలు సాయం చేస్తోందన్నారు. కేంద్రం నిధులతోనే హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. డబుల్‌ ‌బెడ్రూం ఇళ్ళపై భాగ్యనగర ప్రజలను కేసీఆర్‌ ‌వంచించారన్నారు. కేసీఆర్‌ ‌దగాకోరు మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply