Take a fresh look at your lifestyle.

లాలూకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
  • ‌బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌ ‌ను వెంటనే విడుదల చేయాలి
  • భాను ప్రకాష్‌ ‌పై చేయి వేస్తే ఫామ్‌ ‌హౌస్‌ ‌పై చేయి వేస్తామని హెచ్చరిక

బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌కు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హెచ్చరించారు. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయుల పిఆర్సీ నిరుద్యోగ భృతిపై పోరాడుతున్న బీజేవైఎం బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బాను ప్రకాష్‌ను అరెస్ట్ ‌చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

భాను ప్రకాష్‌పై చేయి వేస్తే తాము కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌పైచేయి వేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల పిఆర్సి కొరకు లాఠీ దెబ్బలు తిన్ని నిర్యుద్యోగ భృతి కోసం బిజెపి నేతలు జైలుకు వెళ్లారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మొదటి సారి ఎన్నికల్లో అధికారంలోకి వొస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని అదే రెండోసారి ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వొచ్చారని అన్నారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కానీ. ఒక్కరికి నిరుద్యోగ భృతి చెల్లించలేదని విమర్శించారు. ప్రతి నిర్యుద్యోగికి టి.అర్‌.‌యస్‌ ‌ప్రభుత్వం ఇప్పటివరకు బాకీపడ్డ 78000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. నిర్యుద్యోగుల కోసం 19 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో మాజీ ప్రధాని పి. వి కూతుర్ని తెచ్చి గెలిచే చోట కాకుండా గెలవని చోట నిల్చోబెట్టి ఆ కుటుంబాన్ని కేసీఆర్‌ అవమాన పరుస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ ‌కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేస్తున్నారని, ఆయన పోటీ చేసే ఎమ్మెల్సీ అంటే మెంబర్‌ ఆఫ్‌ ‌లిక్కర్‌ ‌కౌన్సిల్‌ అని బండి సంజయ్‌ ‌చమత్కరించారు. దుబ్బాక ఎన్నికల్లో బిజెపి గెలుపుతో కెసిఆర్‌ ‌ఫార్మ్ ‌హౌస్‌ ‌నుండి ప్రగతి భవన్‌కు రావడం జరిగిందని, హైదరాబాద్‌ ‌జిహెచ్‌ఎం‌సి ఎన్నికలు గెలుపుతో ఎల్‌ఆర్‌ఎస్‌ ‌పోయిందని, పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలిస్తే పిఆర్సి వొస్తుందని తెలిపారు.

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థికి వోటు వేస్తే కెసిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌కు వేసినట్లే అవుతుందని అన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతులు ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న మోసాలను గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం, ఉపాధ్యాయుల పిఆర్సి కోసం పోరాడుతున్న బిజెపి పార్టీ అభ్యర్థికి వోటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌. ‌జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, జిల్లా ఇన్చార్జి రతన్‌ ‌పాండురంగారెడ్డి, మాజీ అధ్యక్షుడు ప్రహ్లాద్‌ ‌రావు స్థానిక బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ ‌కుమార్‌, ఆయా మండలాల బిజెపి, బిజెవైఎం నాయకులు మరియు కార్యకర్తలు మరియు నిరుద్యోగ యువకులు, పట్టభద్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply