- ప్రగతి భవన్పైనే దాడికి దిగుతాం
- జగిత్యాలలో తనను అడ్డుకోవడంపై మండిపడ్డ బండి సంజయ్
తమపై దాడులు చేస్తే ఆ తర్వాత దాడి జరిగేది ప్రగతి భవన్పైనేనని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. తన పర్యటనను అడ్డుకోవడంపై ఆయన తీవ్రంగా మండిప్డడారు. జగిత్యాలలో వి•డియాతో మాట్లాడుతూ తాజాగా స్థానికంగా జరిగిన ఘటనపై స్పందిస్తూ.. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మాది టీఆర్ఎస్ పార్టీ కాదు.. బీజేపీ అంటూ ఎంఐఎం నేతలను ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు.
ఇక రైతుల కోసం శుక్రవారం ప్రధాని మోడీ 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు కేంద్రం జమచేసారని అన్నారు. రైతులకు అనుగుణంగా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువొస్తే కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన..తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కనీస పెట్టుబడి పరిహారం రాలేదని ఆరోపించారు. రైతులు పండించిన పంటను స్వయంగా రైతే ధర నిర్ణయించుకునే విధంగా నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయన్న ఆయన..దేశంలో ఎక్కడైనా లాభం చూసుకొని అమ్మేలా నూతన చట్టం ఉందని చెప్పుకొచ్చారు.