Take a fresh look at your lifestyle.

కుట్రల సూత్రధారి బండి

ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ‌వేదికగా బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే..వొచ్చి పోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ ‌చేసి అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని కేటీఆర్‌ ‌విమర్శించారు.

Leave a Reply