Take a fresh look at your lifestyle.

కుర్చీ వేశాం..సన్మానానికి శాలువా తెచ్చాం..

అయినా ప్రధాని కార్యక్రమాలకు కెసిఆర్‌ ఎం‌దుకు రాలేదు
బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు రాలేదో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇవాళ్టి  షెడ్యూల్‌ ‌బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.  సీఎం కేసీఆర్‌ ‌కోసం తాను చాలా ఎదురుచూశానన్న సంజయ్‌…ఆయనకు కుర్చీ వేశామని, సన్మానం చేసేందుకు శాలువ కూడా తీసుకువచ్చామని అన్నారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు వొస్తే కేసీఆర్‌ ఎం‌దుకు రారన్నారు. కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్‌ ఇప్పు‌డు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.  రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్‌ ‌కోరుకోవడం లేదని, కుటుంబ, నియంత, అవినీతి పాలన అంతం కావాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. కానీ  రాష్ట్ర సర్కార్‌ ‌సహకరించడం లేదని ఆరోపించారు.

Leave a Reply