Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా బంద్‌

Bandh against to central government policiesసూర్యాపేటటౌన్‌: ‌కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు దేశ వ్యాప్త గ్రామీణ బంద్‌లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారల పై సిపిఐ(ఎంఎల్‌) ‌న్యూడెమోక్రసీ, ఐఎఫ్‌టియు. ఎఐకెఎంఎస్‌, ‌సిపిఐ(ఎం), ఎఐటియుసీ, సిఐటియు, పోస్టల్‌ ‌జెఎసి ఆధ్వర్యంలో ఎండ్లబండ్లుతో, కూరగాయాలు, పాలు రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కొత్తబస్టాండ్‌ ‌చౌరస్తా వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐ(ఎంఎల్‌) ‌న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్‌,‌సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. అదే విధంగా కార్మిక చట్టాలను సవరణ చేస్తూ కార్మికుల ప్రయోజనా లను దెబ్బతీసు విధంగా ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.

రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు రధ కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే స్వామినాధన్‌ ‌కమీషన్‌ను రిపోర్టు ఆదారంగా రైతులు పండించే పంటలకు 50శాతం ప్రభుత్వమే చేయూతనివ్వలన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పేర్కోన్నారు.ఈ కార్యక్రమాల్లో నాయకులు గంట నాగయ్య, వీరానాయక్‌, ‌కారింగుల వెంకన్న, ఎస్‌కె సయ్యద్‌, ‌చిత్తలూరి లింగయ్య, తపాలా ఉద్యోగులు లింగయ్య, నర్సింహ్మ, రవి, వీరయ్య, గౌతమ్‌, ‌చంద్రయ్య, సత్యం, నరేష్‌, ‌సిపిఐ(ఎం) జిల్లా ఉపాధ్యక్షులు ముల్కలపల్లి రాములు, మట్టపల్లి సైదులు, మందడి రాంరెడ్డి, చింతలచెరువు భిక్షం, మంగయ్య, రాములు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: suryapet town, iftu band, cpi supports, mulkalapalli ramulu

Leave a Reply