Take a fresh look at your lifestyle.

సమర యోధులపై చిత్ర ప్రదర్శన ప్రారంభించిన బండారు దత్తాత్రేయ

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20: ‌భారత స్వాతంత్యోద్యమ్రం పోరాడిన ప్రముఖ తెలుగు స్వాతంత్య సమర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్‌ ఔ‌ట్రీచ్‌ ‌బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్‌ ‌నిర్వహిస్తోంది. శనివారం నారాయణగూడలోని కేశవ్‌ ‌మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌లో ఈ ప్రదర్శనను హర్యానా రాష్ట్ర గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్క•తిక, పర్యాటక శాఖమంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ స్వాత్రంత్య పోరాటం పాల్గొన్న మహనీయులను, స్మరించుకోవడానికి, యోధుల త్యాగాలను యువతకు తెలియచేయడానికి ఈ ప్రదర్శన ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. .కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర సాధనకు మన పూర్వీకులు చేసిన కృషిని, చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని , ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించాలని పిలుపునిచ్చారు. అనంతరం పీఐబి డైరెక్టర్‌ ‌శృతిపాటెల్‌ ‌మాట్లాడుతూ విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తెలుగు స్వాతంత్య సమరయోధులు చేసిన త్యాగాలు తెలియచేసే సుమారు నలభై కి పైగా చిత్రాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌లో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ ‌నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ ప్రదర్శన నవంబర్‌ 20 ‌నుండి 22 వరకు – మూడు రోజులపాటు ఉంటుందని ఆమె తెలిపారు . పింగళి వెంకయ్య, కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ తదితర స్వాతంత్ర సమరయోధల పాత్రలను తెలియచేసే విషయాలను, చిత్రాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన ప్రచురణల విభాగం స్వాతంత్య పోరాటానికి సంబంధించిన పుస్తక ప్రదర్శనను ఏర్పాటుచేసింది.ఈ కార్యక్రమంలో , ఆర్‌.ఒ.‌బి అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌ ‌హరిబాబు, అర్ధ శ్రీనివాస్‌ ‌పటేల్‌ ‌ప్రచురణల విభాగం అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌ ‌కృష్ణ వందన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply