జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం లేఖ
హైదరాబాద్: రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్, ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయం తెలపాలని సూచించింది.
ఈనెల 30వ తేదీ లోపు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని లేఖలో ఎస్ఈసీ పేర్కొంది.తరువాత ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోబడవని
రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.