Take a fresh look at your lifestyle.

‌ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన బల్దియా చైర్పర్సన్‌ ‌భోగ శ్రావణి
జగిత్యాల అర్బన్‌, ‌జూలై 23 (ప్రజాతంత్ర విలేఖరి) : లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల బల్దియా చైర్పర్సన్‌ ‌శ్రావణి సూచించారు. జగిత్యాల పట్టణంలోని గోవిందపల్లి , గాంధీనగర్‌ ‌వార్డులోని లోతట్టు ప్రాంతాలను బల్దియా చైర్పర్సన్‌ ‌భోగ శ్రావణి ప్రవీణ్‌ ‌పరిశీలించారు. గత మూడు రోజుల నుంచి కురిసిన వర్షంతో గోవింద పల్లి ప్రాంతంలో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ ప్రాంతంలో రవాణా స్థంభించింది. అలాగే రోడ్లపై నుండి ఇళ్లలోకి మురికి చేరిన ప్రాంతాలను పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడి త్వరలోనే, గోవింద పల్లి వాగు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

స్పెషల్‌ ‌డ్రైవ్‌.. ‌శిథిల భవనాల గుర్తింపు………
వానకాలం నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. శిథిల భవనాల గుర్తింపు స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌ను నిర్వహిస్తున్నట్లు, టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు తెలిపారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి తహశీల్దార్‌ ‌తో చర్చించి నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రజలకు సహాయం అందించేం దుకు హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశామని చైర్పర్సన్‌ ‌పేర్కొన్నారు. వెంటనే 9989729888 నెంబరుకు ఫోన్‌ ‌చేస్తే అవసరమైన సలహాలు అందిస్తారన్నారు. అత్యవసర సమయంలో చిన్న సమస్య ఉన్న పరిష్కరనికై హెల్ప్ ‌లైన్‌ ‌లో ఈ నెంబర్‌ ‌కు సంప్రదించాలన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేశామని, 24 గంటలు సేవలు లభిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ ‌బాలే లత శంకర్‌, ‌నక్క జీవన్‌ అల్లే సాగర్‌, ‌కొలగని ప్రేమ లత సత్యం, డి.ఈ లచ్చిరెడ్డి, సానిటరి ఇన్స్పెక్టర్‌ ‌మహేశ్వర రెడ్డి, అశోక్‌, ‌రాము, విజయ్‌ ‌పాల్గొన్నారు.

తాతమ్మ గుడి ఆవరణలో వర్షం నీటి తొలగింపు……
జగిత్యాల శివారు ప్రాంతమైన గొల్లపల్లి రోడ్డులోని తాతమ్మ గుడి ఆవరణలో నీరు నిలిచిపోగా భక్తులు వెళ్లేందు ఇబ్బందులు పడుతున్నారని, స్థానికులచే సమాచారం అందుకున్న చైర్పర్సన్‌ ‌డా.భోగ.శ్రావణి ప్రవీణ్‌ ‌గుడి ఆవరణలో నిలిచిన వర్షం నీటిని జేసిబితో దగ్గరుండి నిటిని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. వెనువెంటనే స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపినందుకు స్థానికులు, భక్తులు ఛైర్పర్సన్‌ ‌గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శానిటరి ఇన్స్పెక్టర్‌ ‌మహేశ్వర రెడ్డి, రాము, విజయ్‌ ‌మున్సిపల్‌ ‌వారివెంట ఉన్నారు.

Leave a Reply