Take a fresh look at your lifestyle.

బక్రీద్‌ ‌ఖుర్భాని ముబారక్‌

‌సిద్దిపేట కలెక్టరేట్‌, ‌జూలై 20(ప్రజాతంత్ర విలేఖరి) : బక్రీద్‌ ‌ముబారక్‌ ‌బీదల పాలిట మహాదానం అని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం అన్నారు. బక్రీద్‌ ‌పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ ‌గ్యాలరీలో మంగళవారం ‘‘బక్రీద్‌ ‌ఖుర్భాని ముబారక్‌’’ ‌క్యాన్వాస్‌ ‌చిత్రాన్ని రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను కళావంతం చేస్తాయన్నారు. బక్రీద్‌ ఈదుల్‌ ‌జుహ పర్వదినం త్యాగానికి, సహనానికి ప్రతీక అనీ పండుగ నాడు ధనవంతులు తమకు కల్గిన సంపదలో బీదలకు రెండున్నర శాతం వస్తురూపేన పంచి అల్లా కృపకు పాత్రులు కావాలని అల్‌ ‌ఖురాన్‌ ‌భోదిస్తుందన్నారు. పండుగ రోజున బీదవాడు కడుపునిండా తినాలన్నదే ‘‘మహాదానం ఖుర్భాని’’ ముఖ్య ఉద్దేశం అన్నారు.

బక్రీద్‌ ‌ప్రపంచ మానవాళికి త్యాగం, సహజీవనం, ఐక్యత, శాంతి, సంతోషాలను అందిస్తుందని, అందించాలని రుస్తుం బక్రీద్‌ ‌ముబారక్‌ ‌తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎఎఫ్‌ అధ్యక్షురాలు జులేఖ రుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం, రహీం రుస్తుం, మైనార్టీ నేత ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply