Take a fresh look at your lifestyle.

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది బక్రీద్‌ ‌పండగ. త్యాగానికీ, బలిదానానికి ప్రతీకయైన బక్రీద్‌ (ఈద్‌-ఉల్‌-‌జుహా) పండుగ ప్రతి సంవత్సరం జిల్‌ ‌హజ్‌ ‌మాసంలో జరుపుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. బక్రీద్‌ అం‌టే ‘‘బకర్‌ ఈద్‌’’ అని అర్థం. ‘‘బకర్‌’’ అం‌టే జంతువని, ‘‘ఈద్‌’’ అం‌టే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బాని ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ‘‘ఈదుల్‌ ‌ఖుర్బాని’’ అని కూడా అంటారు. మహ్మదీయుల క్యాలెండర్‌ ‌ప్రకారం జిల్‌ ‌హజ్‌ ‌నెలలో బక్రీద్‌ ‌పండుగ వస్తుంది. ఇస్లామీయ కేలండర్‌ ‌లో ఈదుల్‌ అజ్‌ ‌హా ఒకే దినంలో వచ్చిననూ, గ్రెగేరియన్‌ ‌కేలండరులో తేదీలు మారుతాయి.

దీనికి కారణం ఇస్లామీయ కేలండర్‌ ‌చంద్ర మాసాన్ని అనుసరించి , గ్రెగేరియన్‌ ‌కేలండర్‌ ‌సూర్య మాసాన్ని అనుసరించి ఉంటుంది. చాంద్ర మాన సంవత్సరం, సూర్య మాన సంవత్సరం కంటే దాదాపు పదకొండు రోజులు తక్కువ. ప్రతి సంవత్సరం ఈదుల్‌ అజ్‌ ‌హా ప్రపంచం లోని వివిధ ప్రాంతాలలో రెండు గ్రెగేరియన్‌ ‌కేలండర్‌ ‌దినములలో సంభవిస్తుంది. దీని కారణం అంతర్జాతీయ దినరేఖ ననుసరించి వివిధ ప్రాంతాలలో చంద్రవంక వేర్వేరు దినాలలో కాన రావడమే. జిల్‌ ‌హజ్‌ ‌నెల పదో రోజున ఈ పండుగ జరుపు కుంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని ‘‘హిజ్రీ’’ అంటారు. హిజ్రీ అంటే వలస పోవడం అని అర్థం. మహ్మద్‌ ‌ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలి వెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ఏటా జిల్‌ ‌మాసం (హిజ్రీ క్యాలెండర్‌ ‌ప్రకారం) 9వ రోజు హజ్‌ (‌కాబా ప్రదక్షిణం), మరుసటి రోజున అనగా 10వ నాడు బక్రీద్‌ (ఈద్‌-ఉల్‌-‌జుహా)లో, ముస్లింలు జరుపు కోవడం సాంప్రదాయంగా ఆచరణలో ఉంది.

ఇబ్రహీం త్యాగమయ జీవితాన్ని ఆదర్శంగా గొని, మనిషికున్న త్యాగ భావాన్ని సజీవంగా ఉంచేందుకు ఈ పండుగను భక్తి భావంతో జరుపు కుంటారు. హజ్రత్‌ ఇ‌బ్రహీం అలైహిసలాం, విగ్రహారాధకుడైన అజర్‌ ఇం‌టిలో జన్మించాడు. అజర్‌ ‌విగ్రహాలను తయారు చేసేవాడు మరియు పురోహితుడు కూడా. బాల్యం నుండీ ఇబ్రహీం ఎల్లప్పుడూ సృష్టికర్తయైన అల్లాహ్‌ ‌గురించే ఆలోచించే వాడు. దైవ సందేశాన్ని అందజేయడంలో భాగంగా, ఇబ్రహీం… ఇరాన్‌ ‌ను వదిలి సిరియా, పాలస్తీనా, ఈజిప్టు మొదలైన ప్రాంతాలలో పర్యటించాడు. ఈ సందర్భంగా ఆయనను అల్లాహ్‌ ‌కఠిన పరీక్షకు గురిచేశారు. తన అర్ధాంగియైన హాజరా మరియు కుమారుడైన హజ్రత్‌ ఇస్మాయిల్‌ అలైహి సలాం ను, త్రాగునీరు కూడా కరువైన భయంకర నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలి పెట్టి, ప్రజలకు దైవ సందేశాన్ని అంద జేస్తూ ధార్మిక ప్రచార కార్యక్రమాలలో నిమగ్నమై పోవాలని అల్లాహ్‌ ఆదేశిస్తారు. అల్లాహ్‌ ఆజ్ఞను శిరసావహించి, ఆయనే తన కుటుంబాన్ని రక్షించగలరనే పరి పూర్ణ విశ్వాసంతో, భార్యా పిల్లలను వదిలేసి దైవ కార్యార్థం వెళతాడు. ఒకరోజు రాత్రి హజ్రత్‌ ఇ‌బ్రహీం నిద్రలో ఉండగా, లేకలేక కలిగిన తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్‌ ‌ను తన స్వహస్తాలతో బలి ఇస్తున్నట్లు కలకంటాడు.

దానిని అల్లాహ్‌ ఆజ్ఞగా భావించి, మరునాడు వంద ఒంటెలను ఖుర్బానీగా సమర్పిస్తాడు. రెండవ రోజు కూడా అదే కలకనగా, తెల్లవారి మరో వంద ఒంటెలను ఖుర్బానీ ఇస్తాడు. ఆరాత్రికూడా అదే కల రావడంతో, అల్లాహ్‌ ‌తనకిష్టమైన వస్తువునే కోరుతు న్నారని భావించి, తనప్రియాతి ప్రియమైన కుమారుడు ఇస్మాయిల్‌ ‌ను ఖుర్బానీగా సమర్పించా లనుకుని , ఈ విషయాన్ని ఇస్మాయిల్‌ ‌లో ప్రస్తావించగా, అందులకై ఇస్మాయిల్‌ ‌సంతోషంగా అంగీకరిస్తాడు. బలి ఇవ్వడానికై సర్వం సిద్ధమై, ఇస్మాయిల్‌ ‌ను పడుకో బెట్టి కత్తితో ఖండించ బోగా, అల్లాహ్‌ అనుమతి లేనందున కత్తి తన కోసే తత్వాన్ని కోల్పోతుంది. వారి భక్తికి మెచ్చిన అల్లాహ్‌, ‌స్వర్గం నుండి జిబ్రాయిల్‌ అలైహి సలాం (దేవదూత) ద్వారా ఇస్మాయిల్‌ ‌స్థానంలో దుంప (గొర్రె)ను ఉంచి, దానిని వారి త్యాగానికి ప్రతీకగా స్వీకరిస్తారు. ఇదే సాంప్రదాయాచరణ ప్రకారం ప్రతి సంవత్సరం ముస్లింలు త్యాగానికి ప్రతీకగా, ఇబ్రహీం త్యాగాన్ని ఆదర్శంగా గొని, బక్రీద్‌ ‌నాడు గొర్రెపిల్లను బలి ఇవ్వడం జరుగుతున్నది. మనిషిలోని త్యాగభావాన్ని సజీవంగా ఉంచేందుకు, తమకిష్టమైన వస్తువును త్యాగం చేయాలనే అల్లాహ్‌ ఆదేశానుసారం, ఏటా పండగ సందర్భంగా గొర్రెను బలి ఇవ్వడం ఆచారంగా మారింది. ఖుర్బానీ గురించి దివ్య ఖురాన్‌ అనుసారం హృదయాల్లో ఉండే త్యాగ భావం, భయభక్తులు మాత్రమే అల్లాహ్‌ ‌సన్నిధికి

చేరుతాయి. ఖుర్బానీ పశువుల రక్తమాంసాలు చేరవు. అలాగే ఖుర్బానీ ఇచ్చే సమయంలో…దీని ప్రాణాలు సర్వం అల్లాహ్‌, ఇం‌కా సమయం వచ్చినపుడు అల్లాహ్‌ ఒప్పందం కోసం, ప్రేమకోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తామని విశ్వాసాన్ని దృఢ పరుచుకుంటారు.

బక్రీద్‌ ‌పండుగను వివిధ దేశాలలో వివిధ పేర్లతో జరుపు కుంటారు.

ఈద్‌ అల్‌-‌కబీర్‌’ : (‌మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, ఈజిప్టు, , లిబియా దేశాలలో)బీ

‘ఫస్కా తమొఖా?ర్త్’ : (‌పశ్చిమ ఆఫ్రికా దేశాలలో)బీ ‘బబ్బర్‌ ‌సల్లాహ్‌’ : (‌నైజీరియాలో)బీ

‘సిద్వైనీ’ : (సోమాలియా, కెన్యా , ఇథియోపియాలో)బీ

‘బడీ ఈద్‌’ ‌లేదా బక్రీద్‌ : (‌భారత దేశం, పాకిస్తాన్‌ ‌లో)బీ

‘వలీయా పెరున్నల్‌’ : (‌కేరళలో)

‘ఖుర్బానీ ఈద్‌’ : (‌బంగ్లాదేశ్‌, ‌దక్షిణాఫ్రికాలో)బీ ‘పెరునాల్‌’ : (‌తమిళనాడులో)బీ

‘కుర్బాన్‌ ‌బైరామి’ : (టర్కీ, అజర్‌బైజాన్‌ ‌లో)’’ బీ ‘కుర్బాన్‌ ‌బజ్రామ్‌’ : (‌బోస్నియా , హెర్జెగొవీనా, అల్బేనియా, కొసావో , బల్గేరియా లో)బీ ‘కుర్బాన్‌ ‌బైరమే’ : (తాతారిస్తాన్‌ ‌లో)బీ ‘కుర్బాన్‌ ‌బైరామ్‌’ : (‌రష్యా లో)బీ ‘కుర్బాన్‌ ఆయిత్‌’ : (‌కజకస్తాన్‌ ‌లో)బీ ‘ఈద్‌ ఎ ‌ఖోర్బాన్‌’ : (ఇరాన్‌ , ఆఫ్ఘనిస్తాన్‌ ‌లో)బీ ‘లోయే అక్తర్‌’ ‌లేదా ‘కుర్బానియే అక్తర్‌’ : (‌పుష్తో భాషీయులు)బీ ‘కుర్బాన్‌ ఈత్‌’ : (‌చైనా , ఉయ్‌ ‌ఘుర్‌ ‌భాషలో)బీ ‘ఈదుల్‌ అద్‌ ‌హా’ (మలేషియా, సింగపూర్‌, ఇం‌డోనేషియా , బ్రూనై లో) వివిధ పేర్లతో పిలుస్తారు.

ముస్లిం సోదరులు జీవితంలో కనీసం ఒక సారి హజ్‌ ‌యాత్ర చేయడం, విధిగా నిర్ణయించ బడింది. యాత్ర చేయగల వారు, కాబాదాకా వెళ్ళగలిగే స్తోమత గలవారు, ఆయన గృహానికి వెళ్ళి హజ్‌ ‌చేస్తారు. దీనిని దాసులపై ఆయనకున్న హక్కుగా భావిస్తారు. త్యాగానికి ప్రతీక యైన బక్రీద్‌ ‌పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకుని, ఖుర్బాని మూడు భాగాలుగా చేసి, ఇంటి వారు, బంధువులతో పాటు మూడవ భాగాన్ని పేదలకు పంచి పెడతారు.

-రామ కిష్టయ్య సంగనభట్ల…

      9440595494

Leave a Reply