Take a fresh look at your lifestyle.

సేవాభావానికి ప్రతీక బక్రీద్‌

“ఓ ‌దేవా, నేను నీ సేవలో ఇక్కడ ఉన్నాను. నీకు భాగస్వాములు లేరు. సర్వ స్తోత్రాలు నీవే. సకల రాజ్యమూ కృపా నీదే. హజ్‌ ‌చేయమని మీరిచ్చిన పిలుపుకు విధేయుడనై హాజరయ్యాను’’ అంటూ చేసే ప్రార్థన. కానీ, ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ ‌యాత్రపై కూడా కరోనా పంజా విసిరింది. ప్రతీ ఏటా బక్రీద్‌ ‌పండగకు నెల రోజుల ముందుగానే ప్రపంచ నలుమూలలకు చెందిన వేలాది ప్రజలు మక్కా యాత్రకు బయల్దేరతారు.”

ఇస్లాం జరుపుకునే పండుగల్లో ఒకటి బక్రీద్‌. ‌దీనికి , ఈదుల్‌ అజ్‌ ‌హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్‌ ఈద్‌ అని కూడా పేర్కొంటారు. త్యాగానికి ప్రతీకగా వ్యవహారించబడే ఈ పండగను మూడు రోజులపాటు జరుపుకుంటారు. రంజాన్‌ ‌పర్వదినం ముగిసిన 70 రోజుల తరువాత ఇస్లామ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకారం 12వ నెల జిల్‌ ‌హజ్‌ 10‌వ రోజున బక్రీద్‌ ‌పండుగను ముస్లింలు జరుపుకుంటారు.

చరిత్ర:
అయిదు వేల సంవత్సరాల క్రితం ఇరాక్‌ ‌ప్రాంతాన్ని నమ్రూద్‌ అనే రాజు పరిపాలి ంచేవాడు. ఆ రాజ్యంలో హజ్రత్‌ ఇ‌బ్రహీం దైవ సందేశాన్ని ప్రచారం చేస్తుండేవాడు. ప్రజలకు న్యాయం, ధర్మ సూత్రాలను భోదిస్తూ మూఢ నమ్మకాలు, అజ్ఞాన అచారాలను సంస్కరిస్తూ దేవుని ఏకత్వాన్ని వివరిస్తూ ప్రచారం చేశాడు. ఆ క్రమంలో అల్లా ఆయనకు ఓ పరీక్ష పెట్టాడు. భార్యను చాలా కాలం తరువాత పుట్టిన కుమారుడిని (ఇస్మాయిల్‌) ‌ను ఎడారిలో వదిలి రావాలని అల్లా హజ్రత్‌ ఇ‌బ్రాహ్మింను ఆదేశించాడు. దీంతో దైవ ఆదేశాలను ఆయన శిరసావహించాడు. వారిద్దరిని ఎడారిలో వదిలేశాడు. హజ్రత్‌ ఇ‌బ్రహీం నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లా కనిపించి ‘నీ కుమారుని నాకు బలి ఇవ్వమ’ని కోరాడు. నిద్ర నుండి మేలొన్న ఇబ్రహీం తన కుమారుడైన ఇస్మాయిల్‌ ‌కు ఈ సంగతి తెలియజేశాడు. దైవ భక్తుడైన ఇస్మాయిల్‌ అం‌దుకు ‘సరే’ అన్నాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం దేవునికి గొర్రెను సమర్పించినందుకు గుర్తుగా ఈ పండుగను బక్రీద్‌ అని పిలుస్తారు.

ఇక ఈ నెలలోనే హజ్‌ ‌తీర్థ యాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్‌-అల్‌-‌హరామ్‌ ‌లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్‌ ‌తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (మహమ్మద్‌ (‌సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. హజ్‌ ‌యాత్రికులు’’లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్‌ . ‘‘ ఓ ‌దేవా, నేను నీ సేవలో ఇక్కడ ఉన్నాను. నీకు భాగస్వాములు లేరు. సర్వ స్తోత్రాలు నీవే. సకల రాజ్యమూ కృపా నీదే. హజ్‌ ‌చేయమని మీరిచ్చిన పిలుపుకు విధేయుడనై హాజరయ్యాను’’ అంటూ చేసే ప్రార్థన. కానీ, ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ ‌యాత్రపై కూడా కరోనా పంజా విసిరింది. ప్రతీ ఏటా బక్రీద్‌ ‌పండగకు నెల రోజుల ముందుగానే ప్రపంచ నలుమూలలకు చెందిన వేలాది ప్రజలు మక్కా యాత్రకు బయల్దేరతారు. లక్షలాది ప్రజలు పాల్గొనే ఆ పవిత్ర యాత్రపై కూడా కరోనా ప్రభావం పడింది. కరోనా వైరస్‌ ‌శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి అత్యంత సాదా సీదాగా హజ్‌ ‌యాత్రకు జరపాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి హజ్కు కేవలం 1000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించింది. జులై 29న ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అయితే హజ్‌ ‌యాత్రలో పాల్గొనే ఈ వెయిమంది కూడా కేవలం సౌదీలో నివసిస్తున్న వారు మాత్రమే. అక్కడ ఉన్న వారికే ఈ సారి హజ్‌ ‌కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. వీరిలో 30 శాతం మంది సౌదీ దేశస్తులు కాగా, మరో 70 శాతం మంది సౌదీలో నివసిస్తున్న విదేశీయులు ఉండనున్నట్లు సౌదీ హజ్‌ ‌మంత్రిత్వశాఖ వెల్లడించింది.

హజ్‌కు వెళ్ళలేనివారు బక్రీద్‌ ‌రోజున తప్పని సరిగా పొట్టేల్‌ను ఖుర్బానీ ఇవ్వాలి. అప్పులు లేకుండా, కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించే వారే ఈ బలిఇస్తారు. అయితే అప్పు చేసిన డబ్బుతో కొనుగోలు చేసిన జంతువును ఖుర్బానీ చేయడం నిషిద్దం. అందుకే సంపన్నుల కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారో అన్నిపొట్టేళ్లు బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఖుర్బాని, మాంసాన్ని మూడు బాగాలుగా చేస్తారు. ఒక భాగం తమ కుటుంబం కోసం, రెండో బాగం ఇరుగు పొరుగువారితో పాటు బంధుమిత్రుల కోసం, ఇక మూడో బాగాన్ని పేదలు, ఫకీర్‌ ‌లకోసం దానం చేస్తారు.ఒక్కొక్కరు ఒక మేక లేదా పొట్టేల్‌ను ఖుర్బానీ చేయలేక పోతే ఏడుగురు సభ్యులు కలసి ఆవు లేదా ఒంటెను ఖుర్బానీ చేయవచ్చు. అయితే ఆవు లేదా ఒంటె ఖరీదులో ఆ ఏడుగురు సమానంగా వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. బలిఇచ్చిన ఆవు లేదా ఒంటె మాంసాన్ని ఏడు బాగాలు చేసి ఎవరి బాగం వారు తీసుకొని వాటిని మూడుబాగాలు చేసి పంపిణి చేయాలి. ఇక బలిఇచ్చిన జంతువు చర్మాన్ని కూడ దానం చేయాలనే నిబంధన ఉంది. దానిని కూడ ముస్లిం సోదరులుపాటిస్తున్నారు.

ఖుర్భానీ ప్రతిఫలం
ఖుర్బానీ ఇచ్చే జంతువు శరీరంపై ఉన్న వెంట్రుకలు సమానంగా పుణ్యం లభిస్తుందని ఇస్లాం ధర్మం చెబుతుంది. అందుకోసమే ముస్లిం సోదరులు ప్రతి ఏటా ఖుర్భానీ ఇస్తారు. ఇప్పుడు దినదిన గండంగా మారు తున్న కరోనాను జయించేందుకు ముస్లిం లందరు పాటుపడాలి. బలిదానానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ ‌సందర్భంగా ముస్లిం సోదరులు కొన్ని త్యాగాలు చేయాలి. కరచాలనం, ఆలింగన పద్ధతులను వదిలి సంభాషణల ద్వారా ముబారక్‌ ‌చెప్పుకోవాలి. రంజాన్‌ ‌పర్వదినాల్లో చూపిన చొరవ బక్రీద్‌లో కూడా చూపాల్సిన అవసరం అందరిపైనా ఉంది. ఈద్‌ ‌నమాజ్‌ ‌మరియు ఖుర్బాని విషయంలో కూడా షరియత్‌ ‌మరియు ప్రభుత్వ నిబం ధనలను పాటిస్తూ పండుగను జరు పుకోవాలి అని ముస్లిం సోద రులం దరికి విజ్ఞప్తి చేస్తూ, సమస్త మాన వాళికి ఈద్‌ ‌ముబారక్‌.

dr md quazaidin
డా।। ఎండి ఖ్వాజామొయినొద్దీన్‌ ‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్ 9492791387

Leave a Reply